CPI NARAYANA : ట్రంప్, మోదీ అబద్ధాలు చెప్తున్నారు.. నారాయణ ఫైర్
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:39 PM
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఉగ్రవాదులను హతమార్చడం అనుమానాలకు తావిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. దేశంలో ప్రతి దు:ఖపూరిత ఘటనను బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ నేతలు వారి స్వలాభం కోసం రాజకీయంగా వాడుకుంటాయని నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఆ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్‌లో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఇటీవల తాను పహల్గామ్‌లో పర్యటించానని గుర్తుచేశారు. పహల్గామ్ వెళ్లి అక్కడి స్థానికులను అడిగితే అసలు వాస్తవాలు బయటపడుతాయని కుండబద్దలు కొట్టారు. ప్రపంచంలో అబద్ధాలు అనర్గళంగా మాట్లాడే వారిలో మోదీ, కేసీఆర్ ముందుటారని ఎద్దేవా చేశారు. ఇవాళ (బుధవారం) ఢిల్లీ వేదికగా నారాయణ మీడియాతో మాట్లాడారు.
పహల్గామ్‌లో(PAHALGAM) పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నట్లు నారాయణ చెప్పుకొచ్చారు. ఉగ్రవాదులు మతం ఆధారంగా చంపారని మోదీ అంటున్నారని, ఉగ్రవాదులు ఇష్టం వచ్చినట్లుగా చంపి వెళ్లిపోతారు తప్ప వివరాలు అడగరని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో(OPERATION SINDOOR) చనిపోయిన వారికి లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన మూడు రోజులకు మోదీ బీహార్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారని.. ఎన్నికల సమయంలో సైనిక చర్యలను రాజకీయం కోసం వాడుకున్నారని నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తాను చెబితేనే యుద్ధాన్ని ఆపారని ట్రంప్ అంటున్నారని.. పాకిస్థాన్ విజ్ఞప్తి మేరకు మోదీ ఆపామని అంటున్నారని.. ఇద్దరిలో ఎవరూ అబద్దం చెబుతున్నారో చెప్పాలని నారాయణ నిలదీశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఉగ్రవాదులను హతమార్చడం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. దేశంలో ప్రతి దు:ఖపూరిత ఘటనను బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ నేతలు వారి స్వలాభం కోసం రాజకీయంగా వాడుకుంటాయని నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రకాష్‌రాజ్‌కు ఈడీ నోటీసులు.. ఇవాళ విచారణకు హాజరు
గుడ్ న్యూస్.. రేవంత్ ప్రభుత్వం మరో కీలకనిర్ణయం.. వాటికి గ్రీన్ సిగ్నల్
Read latest Telangana News And Telugu News