Cyclone Montha: అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి గొట్టిపాటి రవికుమార్
ABN , Publish Date - Oct 28 , 2025 | 08:57 PM
మొంథా తుపానుని ఎదుర్కొనేందుకు అధికారులందరూ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సూచించారు.
పశ్చిమగోదావరి జిల్లా, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మొంథా తుపాను (Cyclone Montha)ని ఎదుర్కొనేందుకు అధికారులందరూ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ (AP Minister Gottipati Ravikumar) ఆదేశించారు. ఇవాళ(మంగళవారం) భీమవరం కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను అనంతరం పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మంత్రి గొట్టిపాటి రవి కుమార్.
మరోవైపు.. పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఇవాళ(మంగళవారం) పర్యటించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పునరావాస కేంద్రాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పునరావాస కేంద్రంలోని ఏర్పాట్లపై తుపాను బాధితులను అడిగి తెలుసుకున్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.
జిల్లాలోని ప్రతీ పునరావాస కేంద్రంలో ఆహారం, తాగునీరు, మందులు అందుబాటులో ఉంచాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. అలాగే, తుపాను కారణంగా కోతకు గురైన పి.ఎం.లంక సముద్ర తీర ప్రాంతాన్ని మంత్రి గొట్టిపాటి, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పరిశీలించారు. సముద్ర కోత నివారణకు అధికారులు చేపట్టిన పనులను మంత్రి గొట్టిపాటి పర్యవేక్షించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని వెల్లడించారు. విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పునరావాస శిబిరాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు
మొంథా తుపాను నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు
Read Latest AP News And Telugu News