Home » Gottipati Ravi Kumar
జగన్‌కు 154 సీట్లిస్తే తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమైపోయి ప్రజల్లోకి రాకుండా ఐదేళ్లు పరదాల చాటు సీఎంగా ఉండిపోయాడు. ఇప్పుడు ప్రజలు 11 సీట్లు ఇవ్వగానే జగన్ రోడ్లపైకి వచ్చి పరామర్శల పేరుతో...
విద్యుత్ చార్జీలను రూపాయి కూడా పెంచబోమని, మళ్లీ ఎన్నికలు జరిగేలోపు తగ్గించాలని ప్రయత్నిస్తున్నామని విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీ వ్యాప్తంగా విద్యుత్ శాఖలో 180 మందికి కారుణ్య నియామకాలు చేశామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. ఏపీలో విద్యుత్ కనెక్షన్ లేని గృహం ఉండకూడదని సీఎం చంద్రబాబు తనను ఆదేశించారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.
Minister Gottipati: పబ్లిసిటీ స్టంట్ కోసం ప్రజల ప్రాణాలను జగన్ గాల్లో కలుపుతున్నారని పల్నాడు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ కాన్వాయ్ కిందపడి ఆ పార్టీ కార్యకర్త సింగయ్య మరణించాడని, కారు ఢీ కొన్న వెంటనే గాయపడిన అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించి ఉంటే బతికేవాడని మంత్రి అన్నారు.
అదానీ స్మార్ట్ మీటర్ల పనితీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలించి 24 గంటల్లోగా నివేదికను సమర్పించాలని విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్)లను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ‘స్మార్ట్ షాక్’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు.
Minister Payyavula Keshav: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో గ్రామస్థాయి నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు కప్పం కట్టారని ఆరోపించారు. ల్యాండ్, మైన్స్, సాండ్, వైన్స్ అన్ని స్కాములు జరిగింది జగన్ హయాంలోనేనని విమర్శలు చేశారు మంత్రి పయ్యావుల కేశవ్.
Minister Kollu Ravindra: వైసీపీ నేతలు చేసిన పాపాలే.. నేడు వారిపాలిట శాపంగా మారాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఓబులాపురం గనుల కుంభకోణంలో గాలి జనార్థనరెడ్డికి శిక్ష పడిందంటే అది టీడీపీ చేసిన పోరాట ఫలితమేనని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తుచేశారు.
మంత్రి గొట్టిపాటి రవికుమార్ డిస్కమ్‌లకు వర్షాలు ప్రారంభమయ్యేలోపు వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఎక్కువగా ఇవ్వాలని ఆదేశించారు. గిరిజన గ్రామాల్లో సోలార్ ప్యానెల్‌లతో పాటు బ్యాటరీ స్టోరేజ్‌తో బల్బులు, ఫ్యాన్లను అందించాలని సూచించారు.
Minister Satya Prasad: ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు కారణంగా ఉపాధి కల్పన జరగడమే కాకుండా ఆర్థికంగానూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పారిశ్రామిక వేత్తలుగా మారే యువతను ప్రోత్సహించేందుకు పెట్టుబడి నిధిలో, విద్యుత్ బిల్లులతో పాటు చాలా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
Minister Gottipati Ravikumar: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత జగన్ ప్రభుత్వంలో చేసిన తప్పులను సరిదిద్దడానికే తమకు టైం సరిపోతుందని చెప్పారు. విద్యుత్ శాఖను జగన్ దుర్వినియోగం చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు.