Minister Nara Lokesh: ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: మంత్రి లోకేష్
ABN , Publish Date - Nov 15 , 2025 | 02:23 PM
అధిక ధరలకు విద్యుత్ ఉత్పత్తి చేసి డేటా సెంటర్లకు సరఫరా చేస్తే వ్యయం ఎక్కువ అవుతోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వ్యయం పెరుగకుండా ఆధునిక టెక్నాలజీలపై సీఎం చంద్రబాబు ఆలోచన చేశారని.. ఈ క్రమంలోనే వాటిని నిజం చేస్తున్నారని వివరించారు. సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెజిలియన్స్ సెంటర్ అనేది విద్యుత్ వ్యవస్థల రక్షణకు పనిచేస్తుందని నొక్కిచెప్పారు.
విశాఖపట్నం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. 6 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ విశాఖకు తీసుకురావాలని ఆలోచన చేశామని వివరించారు. ఇవాళ(శనివారం) సెంటర్ ఫర్ ఎనర్జీ, సైబర్ రెజిలియన్స్ కేంద్రం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సమక్షంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం- ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఎనర్జీ సైబర్ రెజిలియన్స్ సెంటర్ ఎంఓయూ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఎండీ జెరెమీ జర్గెన్స్, ఏపీ ప్రభుత్వ సీఎస్ కె.విజయానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు మంత్రి నారా లోకేష్.
డేటా సెంటర్ ఇప్పుడు సాకారమైందని చెప్పుకొచ్చారు. ఇలాంటి డేటా సెంటర్లు వినియోగించి విద్యుత్ తయారు చేయటం ఓ సవాల్ అని ఉద్ఘాటించారు. అలాగే తక్కువ వ్యయంతో నాణ్యమైన విద్యుత్ తయారు చేయటం కూడా ముఖ్యమైన అంశమని తెలిపారు. అధిక ధరలకు విద్యుత్ ఉత్పత్తి చేసి డేటా సెంటర్లకు సరఫరా చేస్తే వ్యయం ఎక్కువ అవుతోందని పేర్కొన్నారు. ఆ వ్యయం పెరుగకుండా ఆధునిక టెక్నాలజీలపై సీఎం చంద్రబాబు ఆలోచన చేశారని.. ఈ క్రమంలోనే వాటిని నిజం చేస్తున్నారని వివరించారు. సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెజిలియన్స్ సెంటర్ అనేది విద్యుత్ వ్యవస్థల రక్షణకు పనిచేస్తుందని నొక్కిచెప్పారు మంత్రి నారా లోకేష్.
సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తే దానిని తక్షణమే అమలు చేయాలని ఆదేశిస్తారని పేర్కొన్నారు. అందుకే తామంతా వాటిని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామిక వేత్తలను కోరుతున్నానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఇంధన వ్యవస్థల భద్రత అత్యంత కీలకం: జెరెమీ జెర్గెన్స్
ఏఐ ట్రాన్సిషన్ సమయంలో ఇంధన వ్యవస్థల భద్రత అత్యంత కీలకమైన అంశమని ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఎండీ జెరెమీ జెర్గెన్స్ తెలిపారు. ఏపీలో ఇంధన భద్రత, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవటం అభినందనీయమని చెప్పుకొచ్చారు. విద్యుత్ ఉత్పత్తి, ఇంధన భద్రత విషయంలో భారత్‌లో వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయని వివరించారు. ఇలాంటి సమయంలో వ్యవస్థల రక్షణ అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఇందుకు అవసరమైన నిపుణులైన మానవ వనరులను తయారు చేసుకోవాల్సి ఉందని తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా స్వావలంబన సాధించాలంటే ఈ తరహా కేంద్రాలు అవసరమని జెరెమీ జెర్గెన్స్ పేర్కొన్నారు.
విద్యుత్ వ్యవస్థల సెక్యూరిటీ చాలా ముఖ్యం: మంత్రి గొట్టిపాటి రవికుమార్
సెంటర్ ఫర్ ఎనర్జీ, సైబర్ రెజిలియన్స్ కేంద్రం కేవలం టెక్నాలజీ కోసం మాత్రమే కాదని.. ఇంధన వ్యవస్థల రక్షణ కోసం కూడా అవసరమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏపీ 160 గిగావాట్ల గ్రీన్ విద్యుత్ ఉత్పత్తి దిశగా భారీ పెట్టుబడులు తీసుకువస్తుందని వివరించారు. ఈ సమయంలో విద్యుత్ వ్యవస్థల సెక్యూరిటీ చాలా ముఖ్యమని ఉద్ఘాటించారు. అందుకే సెంటర్ ఫర్ ఎనర్జీ, సైబర్ రెజిలియన్స్ కేంద్రం ఏర్పాటు చేసుకుంటున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ మద్యం కుంభకోణం.. అనిల్ చోకరా అరెస్ట్
ఆర్ఐ సతీష్ కుమార్ హత్య కేసు.. ఏబీఎన్ చేతిలో ఎఫ్‌ఐఆర్ కాపీ
Read Latest AP News And Telugu News