ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ఇప్పుడి ప్పుడే ఫలితాలను ఇస్తోంది. జిల్లాలో ర్యాంపులకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతించకపోవడంతో తూర్పు గోదావరి జిల్లా నుంచి ఇసుక దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి.
భారతీయ జనతా పార్టీలో అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడు పాకా వెంకట సత్యనారాయణ. రాష్ర్టీయ స్వయం సేవక్ సంఘ్ భావజాలంతో అడుగులు వేసి బీజేపీలో చేరారు.
అర్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు.
దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న కాళీపట్నం జమిందారీ భూసమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు.
వర్షాకాలంలో ముంపు నివారణ లేకుండా ముందస్తుగా డ్రెయిన్ల ప్రక్షాళనతో సమస్య పరిష్కారానికి అడుగులు వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో డ్రెయిన్ల మరమ్మతులు నిర్వహించకపోవడంతో గతేడాది వచ్చిన వరదల్లో అనేక గ్రామాలు, రోడ్లు, చేపల చెరువులు ముంపు బారిన పడ్డాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ ప్రభుత్వం డ్రెయిన్ల ప్రక్షాళనకు నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన నిధులు సరిపోక పోయినా ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాలతో ప్రత్యేక కమిటీ సభ్యులు ముందుకొచ్చి ఎక్కడికక్కడే డ్రెయిన్లను ప్రక్షాళన చేస్తున్నారు. కైకలూరు నియోజకవర్గంలోని 20 కిలోమీటర్ల పొడవున ఉన్న పుల్లవా డ్రెయిన్, 26 కిలోమీటర్ల పొడవున ఉన్న పెదకొమ్మిలేరు డ్రెయిన్ అభివృద్ధి పనులను చేపట్టారు.
ఫారెస్టు అధి కారులు చేసిన తప్పును సరిచేసుకునే ప్రయత్నం చేస్తు న్నారు. నిడమర్రు మండ లం పెదనిండ్రకొలను – నిడ మర్రు శివారు కొల్లేరు సరి హద్దు ప్రాంతంలో 16 ఎక రాల విస్తీర్ణంలోని రెండు చేపల చెరువులను కొల్లేరు సరస్సు భూమి ఉందంటూ శనివారం ఫారెస్టు అధికారులు గండ్లు కొట్టడంతో ఆ నీరంతా దిగువన ఉన్న వరిచేలను ముం చిన విషయం విదితమే.
వచ్చే మహానాడు లోపు అన్ని జిల్లాల్లోను సంస్థా గత ఎన్నికలను పూర్తి చేసేందుకు తెలుగుదేశం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి నిర్దిష్ట ప్రణాళికను పార్టీ సిద్ధం చేసింది.
‘వీలైతే ఉండి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని అడ్డుపడవద్దని, తనకు పేద, ధనిక తేడా లేదు’ అని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు.
జిల్లాలోని పల్లె ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి జలాలు అందనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అమలుకు చర్యలు తీసుకున్నారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ పనులు దక్కించుకుంది.
లంచం ఇస్తేనే చెరువులు సాగు చేయాలనే ధోరణితో తమను భయబ్రాంతులను చేసి దోచుకోవడమే లక్ష్యంగా కొల్లేరులో ఫారెస్టు అధికారులు వ్యవహరిస్తున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు.