కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:59 PM
పెరుగుతున్న నిత్యా వసరాల ధరలకు అనుగుణంగా అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలతో పాటు సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య డిమాండ్ చేశారు.
జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ వర్కర్ల ధర్నా
జంగారెడ్డిగూడెం,డిసెంబరు12(ఆంధ్రజ్యోతి):పెరుగుతున్న నిత్యా వసరాల ధరలకు అనుగుణంగా అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలతో పాటు సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్దకు వచ్చి ధర్నా నిర్వహించారు. తొలుత పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ ఽధర్నాకు సీపీఐ సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆర్డీవో ఎంవీ రమణకు వినతిపత్రం సమర్పించారు. కృష్ణచైౖతన్య మాట్లా డుతూ రాష్ట్రంలో 4687 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చడాన్ని స్వాగతించారు. మిగిలిన 1,810 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు. అంగన్‌వాడీ వర్కర్స్‌కు యాప్‌ల భారం పెరిగిందని, యాప్‌లన్నీ కలిపి ఒకే యాప్‌గా చేయాలన్నారు. సీపీఐ మండల కార్యదర్శి జంపన వెంకట రమణరాజు, కారం దారయ్య, తాళ్లూరి నాగరాజు, అంగన్‌వాడీ సిబ్బంది గంధం అంజమ్మ, సైదా, రమా, మరియమ్మ, ఇందిర, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.