Share News

కదం తొక్కిన అంగన్‌వాడీలు

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:52 PM

తమ సమస్య లు పరిష్కరించాలంటూ అంగన్‌ వాడీలు కలెక్టరేట్‌ వద్ద శుక్రవా రం భారీ ధర్నా నిర్వహించారు.

కదం తొక్కిన అంగన్‌వాడీలు
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలు

ఏలూరు రూరల్‌, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి):తమ సమస్య లు పరిష్కరించాలంటూ అంగన్‌ వాడీలు కలెక్టరేట్‌ వద్ద శుక్రవా రం భారీ ధర్నా నిర్వహించారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ ఏపీ అంగన్‌ వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో తొలుత ఏలూరు జూట్‌మిల్లు సెంటర్‌ నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్‌ వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో అంగన్‌ వాడీలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, యాప్స్‌ అన్ని కలిపి ఒకే యాప్‌గా మార్చాలని, మెనూ చార్జీలు పెంచాలని, వేతనంతో కూడిన మెటర్నటీ సెలవులను ఇవ్వాలని, అంగన్‌వాడీలకు మే నెల పూర్తిగా వేసవి సెలవులు ఇవ్వాలని, రెండో శనివారం సెలవు అమలు చేయాలని నినదించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.లింగరాజు, ప్రధాన కార్యదర్శి డీఎన్విడీ ప్రసాద్‌, యూనియన్‌ జిల్లా కార్యదర్శి టి.మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 11:52 PM