Share News

ప్రజా దర్బార్‌తో సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Dec 13 , 2025 | 12:14 AM

ప్రజలు తమ సమస్యలను తెలిపి తక్షణ పరిష్కారం పొందడా నికి ప్రజా దర్బార్‌ మంచి వేదికని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

 ప్రజా దర్బార్‌తో సమస్యల పరిష్కారం
అర్జీలు స్వీకరిస్తున్న మంత్రి కొలుసు

మంత్రి కొలుసు పార్థసారథి

ఆగిరిపల్లి, డిసెంబరు 12 (ఆంధ్ర జ్యోతి): ప్రజలు తమ సమస్యలను తెలిపి తక్షణ పరిష్కారం పొందడా నికి ప్రజా దర్బార్‌ మంచి వేదికని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. తహసీల్దార్‌ కార్యాల యంలో శుక్రవారం ప్రజా దర్బార్‌ నిర్వ హించారు. మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 180 అర్జీలు అందగా వాటిలో కొన్నింటిని తక్ష ణమే పరిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ ప్రజా దర్బార్‌లో అందిన అర్జీలను అత్యంత పారదర్శకంగా బాధ్యతతో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. నాలుగు మండలాల తహసీలా ్దర్లు, ఎంపీడీవోలు, పంచాయతీ, రెవెన్యూ కార్య దర్శులు, టీడీపీ నాయకులు చిట్నేని వెం కట శివరామకృష్ణ, మడుపల్లి గోపాలకృష్ణ కుమార్‌, మాదల సత్యకుమార్‌, ఆరేపల్లి శ్రీని వాసరావు, నలజాల హరిబాబు, దొండపాటి ఏసుపాదం, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 13 , 2025 | 12:14 AM