సమాచార హక్కు చట్టంపై పీఆర్ ఇంజనీరింగ్ ఉద్యోగుల ర్యాలీ
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:58 PM
ఏలూరు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఏలూరు ఫస్ట్ అప్పిలేట్ అధికారి ఎస్‌వీ రామన్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి ఎన్‌వీ రమణమూర్తి వారి నేతృత్వంలో సమాచార హక్కు చట్టంపై శుక్రవారం ఏలూరులో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు.
ఏలూరుసిటీ, డిసెంబరు12(ఆంధ్రజ్యోతి): ఏలూరు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఏలూరు ఫస్ట్ అప్పిలేట్ అధికారి ఎస్‌వీ రామన్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి ఎన్‌వీ రమణమూర్తి వారి నేతృత్వంలో సమాచార హక్కు చట్టంపై శుక్రవారం ఏలూరులో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ‘సమాచార హక్కు చట్టాన్ని తెలుసుకోవడం మీ హక్కు, చెప్పడం ప్రభుత్వం బాధ్యత’ అనే నినాదంతో ఏలూరు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సర్కిల్ వారి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ మీదుగా జిల్లా పరిషత్ కార్యాలయం వరకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఉద్యోగులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.