Share News

ఎస్టీ సర్టిఫికెట్ల కోసం.. పోరుబాట

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:51 PM

ముదినేపల్లి మం డలం గురజలో ఏళ్ల తరబడి నివసిస్తున్న ఎస్టీ వర్గానికి చెందిన కొండదొర సామాజిక వర్గీయులు కుల ధ్రువీకరణ పత్రాలను పొందలేని పరిస్థితి నెలకొంది.

ఎస్టీ సర్టిఫికెట్ల కోసం.. పోరుబాట
గురజలో సమావేశమైన కొండదొరలు

గురజ కొండదొరల నిర్ణయం

ముదినేపల్లి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి):ముదినేపల్లి మం డలం గురజలో ఏళ్ల తరబడి నివసిస్తున్న ఎస్టీ వర్గానికి చెందిన కొండదొర సామాజిక వర్గీయులు కుల ధ్రువీకరణ పత్రాలను పొందలేని పరిస్థితి నెలకొంది. బొబ్బిలి ప్రాంతం నుంచి 60 ఏళ్ల క్రితం పనుల కోసం గురజ వచ్చి స్థిరపడిన వారందరూ వాస్తవానికి ఎస్టీ వర్గానికి చెందినవారే. అయినా వాళ్ల పూర్వీకుల గ్రామాల నుంచి మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు తీసు కోకపోవడం వల్ల ఇక్కడ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు అధికారులు ఇవ్వడం లేదు. కొంతమంది మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు తెచ్చుకున్నా అధికారులు ఎస్టీ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు నిరాకరి స్తున్నారు. ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్‌ సౌకర్యాలను, ఉద్యో గ, ఉపాధి రంగాల్లో పొందలేకపోతున్నారు. చివరికి పెన్షన్లు మంజూరు చేసేందుకు కుల ధ్రువీకరణ పత్రం లేదంటూ దరఖాస్తులు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. విద్య, ఉద్యో గాల రిజర్వేషన్‌లో వీరికి న్యాయం జరగడం లేదు. ప్రస్తుతం కొండదొరల జనాభా గురజలో 650 మందికి చేరింది. ఎస్టీలకు గుడివాడ డివిజన్‌లో సర్పంచ్‌ పదవి రిజర్వేషన్‌ అయితే గురజ గ్రామాన్నే అధికారులు ఎంపిక చేసేవారు. ఆ సమ యంలో ఎన్నికల వరకు మాత్రమే తాత్కా లికంగా అధికారులు ఎస్టీ సర్టిఫికెట్‌ ఇచ్చేవారు. దాని ఆధా రంగా ఎన్నికల్లో పోటీ చేసేవారు. అయితే దీనిని కూడా ఐదేళ్ల నుంచి నిలిపివేశారు. కాగా శుక్రవారం స్థానిక అల్లూరి సీతా రామరాజు విగ్రహం వద్ద సమావేశమైన కొండదొరలు ఎస్టీ సర్టిఫికెట్లు పొందేవరకు పోరాడాలని నిర్ణయించుకున్నారు.

Updated Date - Dec 12 , 2025 | 11:51 PM