Share News

పరదా మాటున కబ్జా !

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:49 PM

ఖాళీ స్థలాలు కనపడితే అక్రమార్కులు కబ్జాలకు తెగబడుతున్నారు. అది మున్సిపల్‌ స్థలమైన, ఇరిగేషన్‌ స్థలమైనా జెండా పాతేస్తు న్నారు. ఏలూరు కలెక్టరేట్‌కు కూతవేటు దూ రంలోని జన్మభూమి పార్కును ఆనుకుని కొం దరు పచ్చని పరదా నడుమ ఆక్రమణలకు ఉపక్రమిస్తున్నారు.

 పరదా మాటున కబ్జా !

ఏలూరులో తమ్మిలేరు ఏటిగట్టుపై ఇరిగేషన్‌ స్థలాలకు రెక్కలు.. పట్టించుకోని అధికారులు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ఖాళీ స్థలాలు కనపడితే అక్రమార్కులు కబ్జాలకు తెగబడుతున్నారు. అది మున్సిపల్‌ స్థలమైన, ఇరిగేషన్‌ స్థలమైనా జెండా పాతేస్తు న్నారు. ఏలూరు కలెక్టరేట్‌కు కూతవేటు దూ రంలోని జన్మభూమి పార్కును ఆనుకుని కొం దరు పచ్చని పరదా నడుమ ఆక్రమణలకు ఉపక్రమిస్తున్నారు. ఇక్కడ భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాదారులు ఇరిగేషన్‌కు చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. చాలాకాలంగా తమ్మిలేరు ఏటి గట్టు వరుస ఆక్రమణలతో బక్కచిక్కింది. ఇం దులో తొలుత మెల్లగా ఒక బడ్డీ ఏర్పాటు చేశారు. ఇప్పుడా స్థలంలో కట్టడాలు కట్టేందు కు పచ్చని పరదాను స్థలం నాలుగు వైపులా ఇలా ఏర్పాటు చేశారు. ఇటు వైపు ఏటిగట్టు చాలా భాగం ఆక్రమణల పాలైంది. ఇక్కడ ప్రజారోగ్యశాఖ కార్యాలయంతోపాటు సామా జిక భవనాలు వున్నాయి. మఽధ్యలో ఖాళీ స్థలా లు ఉండడంతో రాత్రి వేళ్లల్లో కబ్జాదారులు గుట్టుచప్పుడు కాకుండా తెగబడుతున్నారు. వీరి వెనుక స్థానిక ప్రజా ప్రతినిధుల హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఇరిగేషన్‌, రెవెన్యూ, అఽధికారులు స్పందిస్తే ఈ విలువైన స్థలా లను కాపాడుకోవచ్చు.

Updated Date - Dec 12 , 2025 | 11:49 PM