వచ్చే నెల 15లోగా టిడ్కో ఇళ్లు అందజేత
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:34 AM
తాడేపల్లిగూడెంలో నిర్మాణ ంలో ఉన్న టిడ్కో గృహ నిర్మాణాలను పూర్తిచేసి వచ్చే నెల 15 లోగా అప్పగించాలని ఎల్అండ్టీ అధికారులను టిడ్కో ఎండీ సునీల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
టిడ్కో ఎండీ సునీల్‌కుమార్‌రెడ్డి
భీమవరం టౌన్/తాడేపల్లిగూడెం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెంలో నిర్మాణ ంలో ఉన్న టిడ్కో గృహ నిర్మాణాలను పూర్తిచేసి వచ్చే నెల 15 లోగా అప్పగించాలని ఎల్అండ్టీ అధికారులను టిడ్కో ఎండీ సునీల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లులో నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించారు. తాడేపల్లిగూడెంలో ఇంకా 1120 ఇళ్లు అప్పగించాల్సి ఉందని తెలిపారు. భీమవరానికి సంబంధించి ఇంకా 6,368 ఇళ్లు నిర్మించాలని, పనులు జరుగుతున్నాయని మార్చి నాటికి పూర్తి స్థాయిలో పూర్తిచెయ్యాలన్నారు. ఎస్టీపీ నిర్మాణం పూర్తయితే 930 ఇళ్లకు సంబంధించి అప్పగించేందుకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు దృష్టిపెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అక్కడ నివాసం ఉంటున్న లబ్ధిదారులు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని ప్లాట్లకు లీకేజీలుఉన్నాయని తెలిపారు. దీనిపై ఆయన స్పందించి ఆదేశించారు. పాలకొల్లుకు సంబందించి ఇంకా 3552 ఇళ్లను మార్చినెలాఖరునాటికి పూర్తిచేసి అప్పగించాలన్నారు. ఆయన వెంట చీఫ్ ఇంజనీర్ మరియన్న, ఎస్ఈ గంగరాజు, ఈఈ తోట వెంకట నారాయణ, శంకర్ తదితరులున్నారు.తాడేపల్లిగూడెం పట్టణంలోని టిడ్కో సముదా యాన్ని కూడా ఆయన శుక్రవారం పరిశీలి ంచారు. పట్టణంలో 5376 టిడ్కో ఇళ్లకు గాను 4208 గృహాలకు రిజిస్ర్టేషన్ పూర్తి అయింద న్నారు. మిగిలిన 1164 గృహాలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని ఈ నెలాఖరు లోపు రిజిస్ర్టే షన్ కార్యక్ర మం పూర్తిచేయాలని మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబుకు సూచించారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను కూడా పరిశీలించారు. లోన్లు ఏ మేరకు మంజూరు చేశారు. ఇంకా ఎంత మం దికి మంజూరు చేయాలనే విషయాన్ని ఎండీ అడిగి తెలుసుకు న్నారు. ఖాళీగా ఉన్న టిడ్కో ఇళ్లకు దరఖాస్తు చేసుకోవడానికి ముందుకు వస్తే పరిశీలించి మంజూరు చేయాలని ఎండీ సూచించారు.