Pawan Kalyan on Google Data Center: వికసిత్ భారత్‌కు విశాఖ గూగుల్ డేటా సెంటర్ గొప్ప ముందడుగు: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Oct 14 , 2025 | 08:32 PM
గమ్యస్థానం నుంచి ‘ వికసిత్ భారత్’కు మార్గం ఇప్పుడు సుగమం అవుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నం గూగుల్ ఏఐ డేటా సెంటర్‌ను, భారతదేశపు మొట్టమొదటి ఏఐ నగరాన్ని పొందడం గొప్ప ముందడుగని పవన్ కల్యాణ్ అభివర్ణించారు.
అమరావతి, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): గమ్యస్థానం నుంచి ‘వికసిత్ భారత్’కు మార్గం ఇప్పుడు సుగమం అవుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. విశాఖపట్నం $15 బిలియన్ల గూగుల్ ఏఐ డేటా సెంటర్ (Visakhapatnam Google Data Center)ను భారతదేశపు మొట్టమొదటి ఏఐ నగరాన్ని పొందడం గొప్ప ముందడుగని అభివర్ణించారు. ఈ చొరవతో అందరికీ ఏఐ శక్తి నిజంగా తెలుస్తోందని ఉద్ఘాటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్.
యువత, రైతులు, వైద్యులు, మత్స్యకారులు, మహిళలు విద్యార్థుల జీవితాలను ఏఐ ప్రభావితం చేస్తోందని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికసిత్ భారత్ కోసం నిరంతరాయంగా చేస్తున్న కృషి.. ఆయన దార్శనికత సృష్టించిన ప్రపంచ విశ్వాసం ప్రత్యక్ష ఫలితం ఇదని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండ్, నాలుగు దశాబ్దాల దార్శనిక అనుభవానికి స్పష్టమైన నిదర్శనమని ప్రశంసించారు పవన్ కల్యాణ్.
భారత్‌లో ఏఐ హబ్‌ను నిర్మించడానికి ప్రతి పౌరుడి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఈ సాంకేతికతను ఉపయోగించుకోవడానికి ఇది మన సమష్టి ఫలితమని తెలిపారు. ప్రభుత్వంతో పాటు, ఈ కొత్త పురోగతి యుగానికి మనమందరం అవసరమని వివరించారు. యువత ఆవిష్కరణలు చేయడం, పరిశోధన చేయడం, ఏఐ పరిశ్రమ స్థాయిని పెంచడం ద్వారా అందరం కలిసి మన భవిష్యత్తుని సరికొత్తగా నిర్మించుకుందామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News