Home » Google
నేడు అంతర్జాతీయ 'పై' దినోత్సవం. దీనిపై ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. ఇది గణితాన్ని వివిధ సబ్జెక్టులతో మేళవించే విధంగా ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఉంది.
కంపెనీ ఉన్నతి కోసం ఎంతగానో కృషి చేస్తున్న సుందర్ పిచాయ్‌కి అల్ఫాబెట్ శుభవార్త చెప్పింది. తాజాగా, భారీ మొత్తంలో ప్యాకేజీని ప్రకటించింది. ది ఫైనాన్షియల్ టైమ్స్ శనివారం తెలిపిన వివరాల మేరకు.. పిచాయ్ ప్యాకేజీని రానున్న మూడేళ్లలో 692 మిలియన్ డాలర్లకు పెంచుతూ అల్పాబెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై చర్చించారు.
ఏఐని, ఇందుకు సంబంధించిన గూగుల్ ప్రణాళికలను స్వీకరించలేని ఉద్యోగులు సంస్థను వీడొచ్చని చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ తాజాగా ఉద్యోగులకు లేఖ రాశారు. ఇలాంటి వారి కోసం స్వచ్ఛంద పదవీ విరమణ ప్యాకేజీని తీసుకొచ్చినట్టు కూడా తెలిపారు.
గూగుల్ నిధుల సమీకరణకు దిగింది. ఈ దిశగా 100 ఏళ్ల కాలపరిమితిపై బాండ్స్ జారీ చేయడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రత్యక్ష మ్యాచుల విశ్లేషణను మరింత లోతుగా, ఆసక్తికరంగా మార్చేందుకు గూగుల్.. ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రత్యక్ష మ్యాచుల వీడియో, ఆడియో వ్యాఖ్యానాన్ని అడ్వాన్స్‌డ్ ఏఐ జెమిని 3 ప్రో విశ్లేషించనుంది. దీంతో అభిమానులు క్రికెట్‌ను మరింత ఆస్వాదించేందుకు వీలుపడనుంది.
ఇటీవల గూగుల్ సంస్థ జెమినై యాప్ ద్వారా ఉచిత ఎస్ఏటీ ప్రాక్టీస్ పరీక్షలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో, ఐఐటీ జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికీ ఇలాంటి ఫీచర్ అందుబాటులోకి తేవాలని భారతీయ విద్యార్థులు నెట్టింట అభ్యర్థించారు.
2025లో ప్రజలకు కేవలం ఆరోగ్యంపై మాత్రమే కాకుండా సంప్రదాయ వంటకాలపై ఆసక్తి పెరిగింది. మరి, ఈ ఏడాది భారతీయులు ఎలాంటి వంటకాలను గూగుల్‌లో సెర్చ్ చేశారో గూగుల్ ట్రెండ్స్‌గా టాప్ ఫుడ్ డ్రింక్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
గూగుల్ సంస్థ తన ఉద్యోగులకు కీలక హెచ్చరిక చేసింది. అమెరికాకు మళ్లీ తిరిగొచ్చేందుకు వీసా స్టాంపింగ్ అవసరమైన వారు దేశాన్ని వీడొద్దని సూచించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో ఒప్పందం జరిగింది. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్ చంద్రబాబు, లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ ఒప్పందంపై సంతకాలు చేశారు.