Google Bed Bugs: గూగుల్ ఆఫీసులో నల్లుల బెడద.. ఉద్యోగులకు కీలక మెసేజ్
ABN , Publish Date - Oct 21 , 2025 | 06:55 PM
ప్రముఖ ఐటీ సంస్థ గూగుల్ కు మరోసారి నల్లుల బెడద తలెత్తింది. అయితే అదేదో గూగుల్ సంస్థకు సంబంధించిన అన్ని కార్యాలయాల్లో అనుకుంటే పొరపాటే. న్యూయార్క్ నగరంలోని గూగుల్ ఆఫీసుకు ఈ సమస్య ఎదురైంది. దీంతో ఉద్యోగులకు ముఖ్య సమాచారాన్ని గూగుల్ ఈ మెయిల్ పంపించింది.
న్యూయార్క్, అక్టోబర్ 21: ప్రముఖ ఐటీ సంస్థ గూగుల్ కు మరోసారి నల్లుల బెడద తలెత్తింది. అయితే అదేదో గూగుల్ సంస్థకు సంబంధించిన అన్ని కార్యాలయాల్లో అనుకుంటే పొరపాటే. న్యూయార్క్ నగరంలోని గూగుల్ ఆఫీసుకు ఈ సమస్య ఎదురైంది. దీంతో ఉద్యోగులకు ముఖ్య సమాచారాన్ని గూగుల్ ఈ మెయిల్ పంపించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
న్యూయార్క్ లోని మాన్‌హట్టన్ చెల్సియా క్యాంపస్‌లోని గూగుల్ (Google) కార్యాలయానికి నల్లుల సమస్య ఏర్పడింది. ఈ సంస్థకు చెందిన పర్యావరణ, ఆరోగ్యం, భద్రతాధికారులు అక్టోబర్ 19న తమ ఉద్యోగులకు ఓ ఈ మెయిల్‌ను పంపారు. ఆఫీసులో నల్లుల బెడద ఉన్నట్లు స్నీపర్ డాగ్ గుర్తించిందన్నారు. అందుకే ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు ఆఫీసుకు రావద్దని తమ ఉద్యోగులకు గూగుల్ సంస్థ తెలియజేసింది. తాము చెప్పే వరకు ఆఫీస్ కు రాకుండా.. వర్క్ ఫ్రమ్ హోం చేయాలని ఈ మెయిల్ లో భద్రతాధికారులు పేర్కొన్నారు. మరోవైపు నల్లుల నివారణకు గూగుల్ సంస్థ(Google) చర్యలు చేపట్టింది. నల్లులకు(Bed Bugs) సంబంధించి ఉద్యోగులకు దురద లాంటి లక్షణాలు ఏమైనా బయటపడితే వెంటనే తెలియజేయాలని సంస్థ కోరింది. తమ ఇళ్లల్లో నల్లులు కన్పిస్తే.. వాటి నివారణకు సంబంధించిన ప్రొఫెషనల్స్‌ను సంప్రదించాలని సూచించింది.
న్యూయార్క్‌లోని గూగుల్(Google) కార్యాలయంలో పెద్ద మొత్తంలో జంతువుల బొమ్మలు ఉంచడం వల్లే ఇది వ్యాపించి ఉండవచ్చని భద్రతాధికారులు అభిప్రాయ పడుతున్నారు. నల్లుల బారినపడి.. ఏవైనా లక్షణాలు కనిపిస్తే దానికి సంబంధించిన హెల్త్ రిపోర్ట్ ను అందజేయాలని ఉద్యోగులకు సూచించింది. దీంతో పాటు పనిచేసే ప్రాంతంలో నల్లులు ఎక్కడైనా కనిపిస్తే తెలపాలని పేర్కొంది. ఇక, న్యూయార్క్‌లోని గూగుల్ ఆఫీసులో నల్లుల(Bed Bugs) బెడద ఘటన చోటుచేసుకోవడం మొదటిసారి కాదు. గతంలో 2010లో కూడా ఇలాంటిదే జరిగింది.
ఇవి కూడా చదవండి:
నానమ్మ వైద్యానికి సాయం కోరిన యువకుడికి ఊహించని షాక్..
జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ ముఖ్య విషయాలపై శ్రద్ధ వహించండి..