Home » International News
కెనడాలోని ఒట్టావాలో భారతీయ విద్యార్థిని వన్షిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 21 ఏళ్ల వన్షిక గత శుక్రవారం రాత్రి ఆపధిని వెతకడానికి వెళ్ళి, తిరిగి రాలేదు, తరువాత ఆమె మృతదేహం ఒంటారియో ప్రావిన్స్లో లభ్యమైంది.
కెనడా సార్వత్రిక ఎన్నికల్లో మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ విజయం సాధించనట్లు కనిపిస్తోంది. ట్రంప్ బెదిరింపులు, భారత్తో విభేదాల నేపథ్యంలో ఈ ఎన్నికలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అమెరికాలో ట్రక్కు డ్రైవర్లంతా తప్పనిసరిగా ఆంగ్లంలో మాట్లాడాల్సిందేనని ట్రంప్ ఆదేశించారు. ఈ నిర్ణయం సిక్కు సంఘాల నుంచి తీవ్ర నిరసనలకు కారణమైంది.
చోటియార్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ మృతదేహాలు కనిపించాయని, పలుచోట్లు బుల్లెట్ గాయాలుండటంతో ఒకే సమయంలో ఈ కాల్పులు జరిగినట్టు అనుమానిస్తున్నామని జిరాయత్ డిప్యూటీ కమిషనర్ జకావుల్లా దుర్రాని తెలిపారు.
ఇరాన్ దేశం బందర్ అబ్బాస్ నగరంలోని షహీద్ రజేయి పోర్టులో ఘోర ప్రమాదం సంభవించింది. శక్తిమంతమైన పేలుడు ధాటికి పోర్టు ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో మంటలు పెద్దఎత్తున ఎగిసిపడి ఆస్తి, ప్రాణనష్టం మిగిల్చాయి.
భారతదేశం-కెనడా సంబంధాల విషయంలో గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో మార్క్ కార్నీ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన భారత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి. ఇదే సమయంలో టర్కీ..పాకిస్తాన్కు సాయం చేసిందన్న ఆరోపణలపై టర్కీ తాజాగా స్పందించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కెనడా ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ నెలకొంది. మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో గెలుపు మెజారిటీగా ఉంటుందా లేక మైనారిటీ ప్రభుత్వంగా మిగిలిపోతుందా అనేది కాసేపట్లో తేలనుంది.
డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఇటీవల ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. అయితే ఇటీవలి కాలంలో ఇలాంటి సంభాషణ జరగలేదని చైనా అధికార ప్రతినిధి ఖండించారు.
రోబోలు వచ్చే ఐదేళ్లలోనే సర్జన్లను మించి శస్త్రచికిత్సల్లో నైపుణ్యాన్ని చూపుతాయని ఎలాన్ మస్క్ చెప్పారు. ఇప్పటికే 137 సర్జరీల్లో రోబోలు విజయవంతంగా పనిచేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది.