-
-
Home » Mukhyaamshalu » Andhra pradesh Telangana national and International ABN Andhra Jyothi latest breaking news and live updates on 7th Dec 2025 kjr
-
BREAKING: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై TPCC చీఫ్ మహేష్‌గౌడ్ ఫైర్
ABN , First Publish Date - Dec 07 , 2025 | 06:07 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 07, 2025 19:34 IST
అవనిపై తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు శ్రమిస్తున్నాం: రేవంత్
నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశాం: సీఎం రేవంత్
రుణమాఫీతో రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచాం: సీఎం రేవంత్
బలహీనవర్గాల ఆకాంక్షలను కులగణనతో కొత్తమలుపు తిప్పాం: సీఎం రేవంత్
వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమాన్ని సార్థకత చేశాం: రేవంత్
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణం సహా..
స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలకు శ్రీకారం చుట్టాం: సీఎం రేవంత్
భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క: రేవంత్
నిన్నటివరకు ఒకలెక్క.. గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరోలెక్క: రేవంత్
-
Dec 07, 2025 19:33 IST
పార్టీ ఫిరాయింపుల్లో కాంగ్రెస్, BRSకు ఏమాత్రం తేడాలేదు: కిషన్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని హామీలు అమలుచేశారో చెప్పాలి: కిషన్‌రెడ్డి
ఒక్క నిరుద్యోగికి కూడా భృతి ఇవ్వలేదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ఏ హామీ అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారు: కిషన్‌రెడ్డి
ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సింగరేణికి ప్రభుత్వం రూ.42 వేలకోట్ల అప్పు ఉంది: కిషన్‌రెడ్డి
-
Dec 07, 2025 19:32 IST
నిజామాబాద్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై TPCC చీఫ్ మహేష్‌గౌడ్ ఫైర్
కిషన్‌రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు: మహేష్‌గౌడ్
కేంద్రమంత్రిగా తెలంగాణకు కిషన్‌రెడ్డి చేసిందేమీలేదు: మహేష్‌గౌడ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకోలేదు
అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీపడేది లేదు: మహేష్‌గౌడ్
కేసీఆర్ నిర్వాకం వల్ల తెలంగాణకు రూ.8 లక్షల కోట్ల అప్పు: మహేష్‌గౌడ్
వడ్డీలు కడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా: మహేష్‌గౌడ్
రానున్న మూడేళ్లలో అన్ని హామీలు నెరవేర్చుతాం: మహేష్‌గౌడ్
-
Dec 07, 2025 16:12 IST
ఆరోరోజు కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం
దేశవ్యాప్తంగా 650 ఇండిగో విమానాలు రద్దు
విమానాల రీషెడ్యూల్‌తో ప్రయాణికుల పడిగాపులు
2,300 ఇండిగో సర్వీసుల్లో అందుబాటులోకి 1,650 విమానాలు
రాత్రి 8లోపు ప్రయాణికుల డబ్బు రీఫండ్ చేయాలన్న DGCA
-
Dec 07, 2025 16:12 IST
కాంగ్రెస్‌ను గద్దె దించేవరకు పోరాడతాం: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు: రాంచందర్‌రావు
ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయలేదు: రాంచందర్‌రావు
కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తోంది: రాంచందర్‌రావు
కాంగ్రెస్ హయాంలోనే హిందువులపై దాడులు: రాంచందర్‌రావు
దేశద్రోహులను కాంగ్రెస్ పెంచిపోషిస్తోంది: రాంచందర్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ లేదు: రాంచందర్‌రావు
-
Dec 07, 2025 14:43 IST
హైదరాబాద్: ప్రభుత్వ ఎన్నికల హామీలు అమలు ఏమైంది?: కిషన్ రెడ్డి
హామీల అమలుపై చర్చకు సిద్ధమా?: కిషన్ రెడ్డి
గులాబీ జెండా పోయి చేయి గుర్తు వచ్చినా దోపిడీ ఆగలేదు
కాంగ్రెస్ కూడా BRS తరహాలోనే నడుస్తోంది: కిషన్ రెడ్డి
-
Dec 07, 2025 14:43 IST
విశాఖ: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ
సౌతాఫ్రికాపై ట్రోఫీ గెలిచిన తర్వాత స్వామివారి దర్శనం
కోహ్లీ, వాషింగ్టన్ సుందర్, స్టాప్‌కు వేద పండితుల ఆశీర్వచనం
కప్ప స్తంభాన్ని అలింగనం చేసుకున్న విరాట్ కోహ్లీ
-
Dec 07, 2025 14:42 IST
హిందూమతంపై ట్వీచ్ చేసిన విజయసాయిరెడ్డి
విశాఖ: హిందూమతంపై కుట్రలు సహించేది లేదు: ఎక్స్‌లో విజయసాయిరెడ్డి
మతమార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపించాలి: విజయసాయి రెడ్డి
డబ్బు ఆశ చూపి మతం మారిస్తే బుద్ధి చెబుదాం: విజయసాయి
-
Dec 07, 2025 14:42 IST
అన్నమయ్య: పుల్లంపేట మం. తిప్పాయపల్లిలో వైసీపీ భూకబ్జాలు
సర్వే నంబర్ 1094లో 10 ఎకరాలు భూకబ్జా చేసిన వైసీపీ నేతలు
రూ.5 కోట్ల విలువచేసే భూమి కబ్జా చేసిన వైసీపీ నేత సుధాకర్ రెడ్డి
కోడుమూరు ఎమ్మెల్యే ఫోన్‌తో ఫారెస్ట్ అధికారులు అలర్ట్
ఆరు జేసీబీలను సీజ్ చేసిన అటవీశాఖ అధికారులు
-
Dec 07, 2025 13:38 IST
జగన్ దుష్ప్రచారం చేస్తున్నారు: ఎంపీ వేమిరెడ్డి..
నెల్లూరు: వైఎస్ జగన్ నాపై దుష్ప్రచారం చేస్తున్నారు: ఎంపీ వేమిరెడ్డి..
వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు జరుగుబాటు లేకుంటే రూ.50వేల చెక్కు ఇచ్చా..
సాయం చేసిన నాపై విమర్శలు చేయడం బాధాకరం: ఎంపీ వేమిరెడ్డి.
-
Dec 07, 2025 13:23 IST
విద్యార్థులను చితకబాదిన టీచర్.. 20 మందికి తీవ్రగాయాలు..
ఉమ్మడి నెల్లూరు: ఓజీలి మండలం ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడు దాష్టీకం
పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు అరుణ్..
ఏడవ తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు..
పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా..
విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
-
Dec 07, 2025 12:27 IST
గాంధీభవన్ పరిసరాల్లో.. పోస్టర్ల కలకలం
హైదరాబాద్: గాంధీభవన్ పరిసరాల్లో కాంగ్రెస్ పాలనను ఎండగడతూ పోస్టర్లు..
రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలన రిపోర్ట్ కార్డు పేరుతో పోస్టర్లు..
అరాచకాల వివరాల కోసం గాంధీ భవన్‌ను సంప్రదించాలంటూ వ్యంగంగా పోస్టర్లు.
-
Dec 07, 2025 12:25 IST
ఫోన్‌ను కొట్టేసిన.. పోలీస్ డ్రైవర్..
హైదరాబాద్: మెహిదీపట్నంలో రూ.1.75 లక్షల ఫోన్ చోరీ..
దొంగను గుర్తించి ఫోన్ రికవరీ చేసి లాకర్‌లో పెట్టిన పోలీసులు..
రికవరీ చేసిన ఫోన్‌ను కొట్టేసిన పోలీస్ డ్రైవర్ శ్రవణ్ కుమార్..
శ్రవణ్ కుమార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు.
-
Dec 07, 2025 12:14 IST
యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ..
యాదాద్రి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
ఆదివారం సెలవు కావడంతో అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు..
స్వామి వారి ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటలు సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం.
-
Dec 07, 2025 12:02 IST
వైసీపీ భూకబ్జా.. మ్మెల్యే ఫోన్‌తో ఫారెస్ట్ అధికారులు అలర్ట్..
అన్నమయ్య: పుల్లంపేట మం. తిప్పాయపల్లిలో వైసీపీ భూకబ్జాలు..
సర్వే నంబర్ 1094లో 10 ఎకరాలు భూకబ్జా చేసిన వైసీపీ నేతలు..
రూ.5 కోట్ల విలువచేసే భూమి కబ్జా చేసిన వైసీపీ నేత సుధాకర్ రెడ్డి..
కోడుమూరు ఎమ్మెల్యే ఫోన్‌తో ఫారెస్ట్ అధికారులు అలర్ట్..
ఆరు జేసీబీలను సీజ్ చేసిన అటవీశాఖ అధికారులు.
-
Dec 07, 2025 11:32 IST
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
లాలాగూడ పీఎస్ పరిధి లాలాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు యువకుల మృతి..
చికిత్స పొందుతున్న మరో ఇద్దరు యువకులు..
మృతి చెందిన వాళ్లు మల్కాజ్గిరికి చెందిన హర్షిత్ రెడ్డి(22), చెంగిచర్ల కు చెందిన శివమణి (23)గా గుర్తింపు..
నలుగురు స్నేహితులు కీసర నుంచి తార్నాకకు టిఫిన్ చేసేందుకు వెళ్తుండగా ఉదయం 6 గంటల సమయంలో ఘోర ప్రమాదం.
-
Dec 07, 2025 11:25 IST
సింహాద్రి అప్పన్న సేవలో.. విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్..
విశాఖ: సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్
సౌత్ ఆఫ్రికా పై గెలిచి ట్రోఫీ గెలుచుకున్న అనంతరం స్వామివారిని దర్శించేసుకున్న విరాట్ కోహ్లీ..
వేద ఆశీర్వచనంతో విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్, సపోర్టింగ్ స్టాఫ్ కు సత్కరించిన వేద పండితులు..
కప్ప స్తంభాన్ని అలింగణం చేసుకున్న విరాట్ కోహ్లీ.
-
Dec 07, 2025 09:50 IST
ట్రావెల్స్ బస్సు బోల్తా..
నెల్లూరు: చిల్లకూరు రైటర్ సత్రం వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా
బస్సులో 35 మంది అయ్యప్పస్వాములు, ఐదుగురికి తీవ్రగాయలు
గుంటూరు నుంచి శబరిమలకు వెళ్తున్న శౌర్యన్ ట్రావెల్స్ బస్సు
-
Dec 07, 2025 09:30 IST
నిద్రిస్తున్న వ్యక్తిపై.. ఎలుగుబంటి దాడి..
అల్లూరి ఏజెన్సీలో నిద్రిస్తున్న వ్యక్తిపై ఎలుగుబంటి దాడి..
జన్ని అప్పారావు అనే గిరిజనుడు తీవ్ర గాయాలు..
అరకులోయ మండలం ఇరగాయి పంచాయితీ ఉరుములు గ్రామ సమీప కొండపై తాను వేసిన చేనుకు కాపలాగా పడుకున్న సమయంలో దాడి..
శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ఎలుగుబంటి దాడి..
తల, చేతులపై బలంగా చీరడంతో గట్టిగా అరుచుకుంటూ కొండ కిందకు పరుగులు తీసిన జిన్ని అప్పారావు..
స్థానికులు గుర్తించి 108 సహాయంతో పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలింపు.
-
Dec 07, 2025 08:05 IST
రెండు స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు..
కృష్ణాజిల్లా: గుడివాడ గుడ్లవల్లేరు మండలంలో రెండు స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అనారోగ్యంతో వచ్చిన.
ఇందిరా కాలనీకి చెందిన మానస, పామర్రుకు చెందిన అమలేశ్వరి..
పరీక్షల్లో స్క్రబ్ టైఫస్ నిర్ధారణ అయినట్లు వెల్లడించిన వైద్య అధికారి యశస్విని.
-
Dec 07, 2025 07:25 IST
గోవా అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి..
గోవా అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని..
మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా..
క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటన.
-
Dec 07, 2025 07:16 IST
రేపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
ఫ్యూచర్‌సిటీ వేదికగా జరగనున్న గ్లోబల్ సమిట్..
రేపు మధ్యాహ్నం 1:30కి సమ్మిట్ ప్రారంభం..
గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించనున్న గవర్నర్..
రేపు మధ్యాహ్నం 2:30కి సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం..
హాజరుకానున్న 44 దేశాలకు చెందిన 154 మంది ప్రతినిధులు..
ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు ముగింపు.
-
Dec 07, 2025 07:15 IST
కెనడాలో భూకంపం
కెనడాలో భూకంపం..
భూకంప తీవ్రత 7.0గా నమోదు.
-
Dec 07, 2025 07:09 IST
నేడు ఇందిరాపార్క్ వద్ద ధర్నా
హైదరాబాద్: నేడు ఇందిరాపార్క్ దగ్గర టీ బీజేపీ ధర్నా..
కాంగ్రెస్ పాలనపై ప్రజావంచన దినం పేరిట నిరసన..
ధర్నాలో పాల్గొననున్న కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు.
-
Dec 07, 2025 07:08 IST
నేడు కర్ణాటకకు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
నేడు కర్ణాటకకు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించనున్న డిప్యూటీ సీఎం.
-
Dec 07, 2025 06:17 IST
ఇండిగో సీఈఓకు షోకాజ్ నోటీసులు
ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు షోకాజ్ నోటీసులు..
షోకాజ్ నోటీసులు జారీ చేసిన పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్..
విధి నిర్వహణలో విఫలమవడంతో పీటర్ ఎల్బర్స్‌కు నోటీసులు జారీ.
-
Dec 07, 2025 06:07 IST
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్‌కు జైలు శిక్ష
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్‌రెడ్డికి జైలు శిక్ష..
జైలు శిక్షతో పాటు, రూ.2 వేలు జరిమానా విధింపు..
తీర్పును 6 వారాల పాటు సస్పెండ్ చేసిన హైకోర్టు..
Botony విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నూకన్న దొరను కొనసాగించాలని కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయనందుకు ఉత్తర్వులు..
అప్పీల్ చేయకపోయినా, స్టే రాకపోయినా..
ఈ నెల 22 వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు లొంగిపోవాలని ఆదేశాలు.