Share News

Musk predicts war: వచ్చే పదేళ్లలో అణు యుద్ధం తప్పదు.. ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Dec 02 , 2025 | 07:04 PM

రాబోయే ఐదు, పదేళ్లలో అణుయుద్ధం జరగొచ్చని ప్రపంచ కుభేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఎక్స్‌లో ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు స్పందనగా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. మస్క్ అణు యుద్ధం గురించి ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Musk predicts war: వచ్చే పదేళ్లలో అణు యుద్ధం తప్పదు.. ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు..
Elon Musk statement

రాబోయే ఐదు, పదేళ్లలో అణుయుద్ధం జరగొచ్చని ప్రపంచ కుభేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఎక్స్‌లో ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు స్పందనగా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'శక్తివంతమైన దేశాల మధ్య యుద్ధాన్ని నివారించడంలో అణ్వాయుధాలు కీలక పాత్ర పోషిస్తాయని కొన్ని ప్రభుత్వాలు పిచ్చిగా నమ్ముతున్నాయి. కాబట్టి అలాంటి ప్రభుత్వాలపై బయటి శక్తుల నుంచి ఎలాంటి ఒత్తిడీ ఉండదు' అని పేర్కొన్నారు (Elon Musk war inevitable).


ఈ ట్వీట్‌పై ఎలన్ మస్క్ స్పందిస్తూ.. 'యుద్ధం తప్పదు. రాబోయే ఐదు, పదేళ్లలో అణు యుద్ధం జరుగుతుంది' అని పేర్కొన్నారు. మస్క్ చేసిన ఈ ట్వీట్‌పై విపరీతంగా చర్చ జరుగుతోంది. అయినప్పటికీ తన ట్వీట్‌పై మస్క్ ఎలాంటి వివరణా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన డోజ్ శాఖలో మస్క్ కీలక బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. ఆ డోజ్ నుంచి బయటకు వచ్చిన మస్క్ అణు యుద్ధం గురించి ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది (global conflict warning).


అణు యుద్ధం గురించి మస్క్ (Elon Musk statement) ఇలా ఎందుకు మాట్లాడారనే విషయంలో ఎవరికీ క్లారిటీ రావడం లేదు. మస్క్ వ్యాఖ్యల గురించి వివరణ ఇవ్వాలంటూ ఏఐ వేదిక గ్రోక్‌ను కొందరు నెటిజన్లు అడిగారు. దానికి గ్రోక్ స్పందిస్తూ.. సామూహిక వలసలు, రాజకీయ కారణాల వల్ల యూరప్, యూకేలో అంతర్యుద్ధం జరగొచ్చని మస్క్ హెచ్చరించి ఉంటారని తెలిపింది. గతంలో ఈ ఘటనలపై మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు.


ఇవీ చదవండి:

ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా ఆదాయాన్ని కోల్పోనున్న అమెరికా యూనివర్సిటీలు

నా పార్టనర్ భారత మూలాలున్న వ్యక్తి, నా కొడుకు పేరు శేఖర్: ఎలాన్ మస్క్

Read Latest and Viral News

Updated Date - Dec 02 , 2025 | 07:04 PM