చోటియార్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ మృతదేహాలు కనిపించాయని, పలుచోట్లు బుల్లెట్ గాయాలుండటంతో ఒకే సమయంలో ఈ కాల్పులు జరిగినట్టు అనుమానిస్తున్నామని జిరాయత్ డిప్యూటీ కమిషనర్ జకావుల్లా దుర్రాని తెలిపారు.
Restaurant Fire: హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సిబ్బంది గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. అగ్ని మాపక దళాలు మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. పోలీసులు చనిపోయిన 22 మంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపారు.
భారతదేశం-కెనడా సంబంధాల విషయంలో గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో మార్క్ కార్నీ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన భారత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖలిస్థానీ అనుకూల నేత, ఎన్డీపీ పార్టీ అధినేత జగ్మీత్ సింగ్‌కు తాజా కెనడా ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. ఎన్నికల్లో జగ్మీత్ ఓటమి చెందనగా ఎన్డీపీ జాతీయ హోదా కోల్పోయే స్థితికి చేరుకుంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి. ఇదే సమయంలో టర్కీ..పాకిస్తాన్‌కు సాయం చేసిందన్న ఆరోపణలపై టర్కీ తాజాగా స్పందించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కెనడా రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరమైన చర్చలకు కేంద్రంగా మారాయి. ఏప్రిల్ 28, 2025న జరిగిన సమాఖ్య ఎన్నికల్లో, మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ విజయానికి దగ్గరైంది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రాబోతోంది. ఈ ఎన్నికల్లో లిబరల్ పార్టీ దాదాపు 150 సీట్లు గెలుచుకున్నట్టు అంచనాలు వచ్చాయి.
కెనడా ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ నెలకొంది. మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో గెలుపు మెజారిటీగా ఉంటుందా లేక మైనారిటీ ప్రభుత్వంగా మిగిలిపోతుందా అనేది కాసేపట్లో తేలనుంది.
డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఇటీవల ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. అయితే ఇటీవలి కాలంలో ఇలాంటి సంభాషణ జరగలేదని చైనా అధికార ప్రతినిధి ఖండించారు.
రోబోలు వచ్చే ఐదేళ్లలోనే సర్జన్లను మించి శస్త్రచికిత్సల్లో నైపుణ్యాన్ని చూపుతాయని ఎలాన్ మస్క్ చెప్పారు. ఇప్పటికే 137 సర్జరీల్లో రోబోలు విజయవంతంగా పనిచేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది.
యూరప్‌లోని స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాల్లో తీవ్రమైన విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిని, విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.