-
-
Home » Mukhyaamshalu » Andhra pradesh Telangana national and International latest breaking news and live updates on 10th December 2025 vreddy
-
BREAKING: గాజాలో శాంతి కోసం భారత్ మద్దతు ఉంటుంది: మోదీ
ABN , First Publish Date - Dec 11 , 2025 | 06:50 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 11, 2025 13:05 IST
తెలంగాణలో ముగిసిన తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
మ.ఒంటిగంటలోపు లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం
-
Dec 11, 2025 12:54 IST
తెలంగాణ బీజేపీ ఎంపీలపై అగ్రహం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
తెలంగాణలో సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారని ఆగ్రహం
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని ఎంపీలకు మోదీ హితువు
-
Dec 11, 2025 11:51 IST
తెలంగాణ: జాతీయరహదారిపై భారీగా నిలిచిన వాహనాలు
ఎల్బీనగర్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్
పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాలకు వెళ్తున్న ఓటర్లు
ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు ఓటు కోసం వెళ్తున్న ఓటర్లు
-
Dec 11, 2025 11:50 IST
తమిళనాడు: సీఎం స్టాలిన్ సమక్షంలో DMKలో చేరిన TVK అధినేత విజయ్ సన్నిహితుడు సెల్వకుమార్
TVKలో నాకు గౌరవం దక్కలేదు
ఇతర పార్టీల నుంచి వస్తున్నవారికే ప్రాధాన్యమిచ్చారు
TVKలో కష్టపడి పనిచేసేవారికి విలువలేదు: సెల్వకుమార్
-
Dec 11, 2025 11:49 IST
ఢిల్లీ: సోనియా, రాహుల్, ప్రియాంకతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించిన సీఎం రేవంత్
పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై వివరణ
గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన తీరును సోనియాకు వివరించిన సీఎం రేవంత్
సమావేశంలో పాల్గొన్న మంత్రి వివేక్, టీకాంగ్రెస్ ఎంపీలు
-
Dec 11, 2025 11:21 IST
పల్నాడు: మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు
కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డి
జంటహత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి బ్రదర్స్
సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ రద్దుతో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్
గురజాల సబ్ డివిజన్‌లో 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమలు
-
Dec 11, 2025 11:13 IST
పల్నాడు: కాసేపట్లో మాచర్ల కోర్టుకు పిన్నెల్లి సోదరులు
కోర్టు ముందు లొంగిపోనున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డి
జంటహత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి బ్రదర్స్
సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ రద్దుతో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్
గురజాల సబ్ డివిజన్‌లో 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమలు
-
Dec 11, 2025 10:23 IST
ఢిల్లీ: అమరావతి బిల్లుపై జగన్ విషం కక్కుతున్నారు: పెమ్మసాని చంద్రశేఖర్
జగన్‌ను శాశ్వత రాజకీయ సమాధి చేయాలి: కేంద్రమంత్రి పెమ్మసాని
రైతులు ఇచ్చిన భూములను వినియోగించుకోవడం చేతకాక..
ఏపీ భవిష్యత్‌ను జగన్ నాశనం చేశారు: పెమ్మసాని చంద్రశేఖర్
అమరావతికి నిధులు ఇవ్వొద్దని జగన్ వరల్డ్ బ్యాంక్‌కు లేఖలు రాస్తున్నారు
అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు పార్లమెంట్‌లో బిల్లు పెడతాం
సాంకేతిక కారణాలతోనే అమరావతి బిల్లు ఆలస్యం: పెమ్మసాని
అమరావతి బిల్లును సీఎం చంద్రబాబు మానిటర్ చేస్తున్నారు: పెమ్మసాని
-
Dec 11, 2025 09:02 IST
సంగారెడ్డి జిల్లా: నేడు మునిపల్లి మండలం కంకోల్ లోని వోక్సన్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి రాక
సాయంత్రం 4 గంటలకు యూనివర్సిటీ గ్రౌండ్ లో ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేయనున్న సీఎం
-
Dec 11, 2025 08:59 IST
టొరెంటోలో మంత్రి నారా లోకేష్ పర్యటన
బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గీల్డీ హైదర్‌తో లోకేష్ భేటీ
ఏపీలో కెనడియన్ పెట్టుబడులకు సహకారం అందించండి: లోకేష్
స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలతో ఏపీ ముందుకెళ్తోంది: లోకేష్
ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులకు సహకారం అందించండి: లోకేష్
గత 18నెలల్లో ఏపీకి రూ.20లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి
ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: మంత్రి లోకేష్
-
Dec 11, 2025 08:18 IST
నేడు కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నిక
వైసీపీ మేయర్ అభ్యర్థిగా 47వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ పేరు ఖరారు
మేయర్‌ను అధికారికంగా ప్రకటించనున్న జాయింట్ కలెక్టర్ అదితిసింగ్
స్థానిక ఎన్నికలు, మేయర్ పదవీకాలానికి..
మూడేళ్ల గడువు ఉండటంతో పోటీకి దూరంగా టీడీపీ
రేపటి వరకు కడప కార్పొరేషన్ పరిధిలో 144 సెక్షన్
-
Dec 11, 2025 07:04 IST
ఇవాళ తొలి విడత పంచాయితీ ఎన్నికలు
7గంటలకు పోలింగ్ స్టార్ట్
1 ఒంటి గంట వరకు పోలింగ్
ఆ తరువాత కౌంటింగ్ ఫలితాల విడుదల
ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నేడే
ఏక గ్రీవాలు మినహా 3,834 పంచాయితీల్లో పోలింగ్
డెబ్భై వేల మందితో పటిష్ట భద్రతా
ఏజెన్సీ ఏరియాలపై ఈసీ స్పెషల్ ఫోకస్
-
Dec 11, 2025 06:50 IST
అమరావతి నిర్మాణానికి నాబార్డు నుంచి రూ.7,380 కోట్ల..
రుణం తీసుకునేందుకు CRDAకి అనుమతి ఇవ్వనున్న కేబినెట్
సీడ్ యాక్సెస్ రోడ్‌ను 16వ NHకు అనుసంధానం పనులకు..
రూ.532 కోట్లకు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్
పలు సంస్థలకు భూకేటాయింపులకు అనుమతి ఇవ్వనున్న కేబినెట్
రూ.169 కోట్లతో లోక్ భవన్ నిర్మాణం కోసం..
టెండర్లు పిలిచేందుకు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్
రూ.163 కోట్లతో జ్యుడిషియల్ అకాడమీకి..
పరిపాలన అనుమతులకు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్
-
Dec 11, 2025 06:50 IST
నేడు TVK ముఖ్యనేతలతో విజయ్ అత్యవసర భేటీ
TVK చేరికలపై విజయ్ ప్రధాన చర్చ
-
Dec 11, 2025 06:50 IST
ఇండిగో యాజమాన్యానికి మరోసారి DGCA నోటీసులు
ఇవాళ సమావేశానికి రావాలని ఇండిగో అధికారులకు ఆదేశం
పూర్తి నివేదికతో హాజరుకావాలని ఆదేశించిన DGCA
-
Dec 11, 2025 06:50 IST
గాజాలో శాంతి కోసం భారత్ మద్దతు ఉంటుంది: మోదీ
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదు: మోదీ