Cyclone Montha: మొంథా తుఫాను ఎఫెక్టు.. పలు రైళ్లు రద్దు
ABN , Publish Date - Oct 29 , 2025 | 05:30 PM
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో పలుచోట్ల బుధవారం జోరువాన కురిసింది. ఈ క్రమంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మొంథా తుఫాన్ కారణంగా పలు రైళ్లని రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మొంథా తుఫాన్ (Cyclone Montha) ప్రభావంతో ఇవాళ (బుధవారం) జోరువాన కురిసింది. కుండపోతగా వర్షం కురుస్తోండటంతో వాగులు, చెరువులు, నదులు ఉధృతంగా ప్రవహించాయి. జలాశయాలకు భారీగా వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో రైలు పట్టాలు దెబ్బతిన్నాయి.
ఈ క్రమంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మొంథా తుఫాన్ కారణంగా పలు రైళ్లని రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇవాళ(బుధవారం) 49, రేపు(గురువారం) 6 రైళ్లు రద్దు చేస్తునట్లు ప్రకటించారు. ఇవాళ 15 రైళ్లు, రేపు 12 రైళ్లు దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమైనవి: మంత్రి సత్యకుమార్
మొంథా తుఫాను ప్రమాదం తప్పింది.. కానీ చాలా నష్టపోయాం..
Read Latest AP News And Telugu News