Minister Ponnam Prabhakar: మోదీవి కక్ష సాధింపు చర్యలు.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
ABN , Publish Date - Apr 17 , 2025 | 09:17 AM
Minister Ponnam Prabhakar: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పై మోదీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. సీబీఐ, ఈడీల మీద ఆధారపడే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని .. మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

సిద్దిపేట జిల్లా : దేశాభివృద్ధి కోసమే త్యాగం చేసిన గాంధీ కుటుంబం నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిలో కక్ష సాధింపులకు గురవుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపణలు చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించి, దేశంలో ప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించిన కాంగ్రెస్ నాయకత్వం అవినీతికి పాల్పడదలుచుకుంటే వారి చేతిలో ఉన్న అధికారంతో గాంధీ కుటుంబం ఎక్కడో ఉండేదని అన్నారు. ఇవాళ(గురువారం) హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా కాంగ్రెస్‌ను ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు నరేంద్రమోదీ పాల్పడుతున్నారని విమర్శించారు. తమ పార్టీ అగ్రనేతలు అడిగిన ప్రశ్నలకు మోదీ జవాబు చెప్పలేక కాంగ్రెస్ నాయకత్వాన్ని బలహీనపరచాలనే కుట్రతో ఇలాంటి వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఈడీల మీద ఆధారపడే మోదీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. మిత్రపక్షాలకు సంబంధించిన నేతలు ఎంత అవినీతి చేసిన మాట్లాడకుండా, రాజకీయంగా ప్రత్యర్థులను కక్ష సాధింపు చేసే ధోరణి మంచిది కాదని హితవు పలికారు. దేశం మొత్తం గాంధీ కుటుంబానికి అండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈడీ కార్యాలయం ఎదుట టీ కాంగ్రెస్ ధర్నా
హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట ఇవాళ(గురువారం) తెలంగాణ కాంగ్రెస్ ధర్నా నిర్వహించనుంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక చార్జిషీట్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని చేర్చడంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. నిన్న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అందుబాటులో లేకపోవడంతో ఈ రోజుకు టీ కాంగ్రెస్ ధర్నాను వాయిదా వేసింది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయం ఎదుట టీ కాంగ్రెస్ ధర్నా చేపట్టనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
National Herald Case: రాజకీయ ఈడీ కేసు
CM Revanth Reddy: జపాన్‌లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్
Kanch Gachibowli: కంచగచ్చిబౌలి భూములకు అటవీ లక్షణాలు!
Read Latest Telangana News And Telugu News