Home » Ponnam Prabhakar
ఆర్టీసీని మరింత విస్తరిస్తాం.. కొత్తగా 373 కాలనీలకు బస్సులు నడుపుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... రాజధాని హైదరాబాద్ నుంచి గ్రామాల వరకు ఆర్టీసీని మరింత విస్తరిస్తామని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడులు సునామీలా పోటెత్తాయి! తొలిరోజే 35కుపైగా సంస్థలు ఏకంగా రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి......
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిసెంబర్ 3వ తేదీన హుస్నాబాద్‌లో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి.
హైదరాబాద్ నగరంలో రాబోయే రోజుల్లో మరిన్ని ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని నగర ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ క్యాంటీన్లను నిరుపేద ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్ బాలరాజుపై దాడి ఘటనకు సంబంధించి మంత్రి పొన్నం స్పందించారు. బాలరాజుతో ఫోన్లో మాట్లాడి అతడిని ఓదార్చారు. ఈ క్రమంలో మంత్రితో ఫోన్ మాట్లాడుతూ డ్రైవర్ కంటతడి పెట్టుకున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద అభివృద్ధి జరిగేలా గోపాల మిత్రలు ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు. వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంబంధిత మంత్రి శ్రీహరిని కోరుతున్నానని పేర్కొన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ చేసి గెలుపొందారని మంత్రి పొన్నం అన్నారు. సెంటిమెంట్ మేనేజ్మెంట్ చేయడంలో బీఆర్ఎస్ నేతలకు అనుభవముందంటూ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ... ప్రమాదాలు జరుగకుండా రవాణా శాఖ అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. ఈరోజు జరిగిన చేవెళ్ల ప్రమాదంలో రెండు వాహనాలకు ఫిట్‌నెస్ ఉన్నప్పటికీ ఇరుకు రోడ్డు, డివైడర్ లేకపోవడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ .
హుస్నాబాద్ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉందని.. పూర్తిగా జలమయం అయిందని మంత్రి పొన్నం తెలిపారు. రైతాంగం పూర్తిగా నష్టపోయిందన్నారు. వేలాది ఎకరాల్లో ధాన్యం దెబ్బతిన్నదని.. కొట్టకుపోయిందని అన్నారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరికొందరు.. గాయాలతో బయటపడ్డారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.