Minister Ponnam Prabhakar: ఆర్టీసీని మరింత విస్తరిస్తాం.. కొత్తగా 373 కాలనీలకు బస్సులు
ABN , Publish Date - Dec 11 , 2025 | 08:27 AM
ఆర్టీసీని మరింత విస్తరిస్తాం.. కొత్తగా 373 కాలనీలకు బస్సులు నడుపుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... రాజధాని హైదరాబాద్ నుంచి గ్రామాల వరకు ఆర్టీసీని మరింత విస్తరిస్తామని ఆయన అన్నారు.
- సుమారు 7 లక్షల మందికి ప్రయోజనం
- ఎలక్ర్టిక్ బస్సుల ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం
హైదరాబాద్ సిటీ: రాజధాని నుంచి గ్రామాల వరకు ఆర్టీసీని మరింత విస్తరిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. రాణిగంజ్ డిపోలో 65 ఎలక్ర్టిక్ బస్సులను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మేయర్ విజయలక్ష్మితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ర్టిక్ బస్సుల వినియోగాన్ని తెలంగాణ ఆర్టీసీ విస్తృతం చేస్తోందన్నారు. గ్రేటర్(Greater)లో 373 కొత్త కాలనీ రూట్లలో ఆర్టీసీ బస్సులు ప్రారంభించిందన్నారు.

దీనివల్ల సుమారు 7 లక్షల మందికి అదనంగా ప్రజా రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో 40 శాతం బస్సులను అదనంగా కొనుగోలు చేసినట్లు తెలిపారు. టీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో 2,400 కొత్త బస్సులు వచ్చాయన్నారు. గ్రేటర్‌లో వచ్చే రెండేళ్లలో మొత్తం 2800 ఎలక్ర్టిక్ బస్సులు వస్తాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతరెడ్డి, స్థానిక కార్పొరేటర్ సుచరితరెడ్డి, గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్, ఈడీలు, అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
2030 నాటికి అమెజాన్ ఇండియా రూ.3.15 లక్షల కోట్ల పెట్టుబడులు
3 నెలల్లో తుమ్మిడిహెట్టి డీపీఆర్
Read Latest Telangana News and National News