Home » TGSRTC
పుష్పక్ బస్సుల్లో రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఉన్న చార్జీల్లో రూ.50 తగ్గిస్తున్నట్లు శుక్రవారం గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎయిర్‌పోర్ట్ నుంచి జూబ్లీబస్ స్టేషన్‌కు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రూ.450 చార్జీలు వసూలు చేస్తుండగా దాన్ని రూ.400గా నిర్ణయించారు.
పుష్పక్ బస్సుల్లో రాత్రిపూట రూ. 100, పగటి పూట రూ. 50 చార్జీలు పెంచి ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తోంది ఆర్టీసీ. నగరంలో పలు ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి నడుపుతున్న పుష్పక్ బస్సుల్లో చార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో నడిచే టీజీఎస్ ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలపై ఆర్టీసీ రాయితీ ప్రకటించింది.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో బుధవారం తెల్లవారుజామున నిలిపిఉంచిన ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘మహాలక్ష్మి’ పథకంతో ఆర్టీసీ ఆర్థికంగా బలోపేతమవుతోందని.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
హైదరాబాద్‌కు కేంద్రం ప్రకటించిన 2000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలని టీజీఎస్..
గ్రేటర్‌లో టీ-24 టికెట్ల చార్జీలు చార్జీలు రూ.120 నుంచి రూ.150కి పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనరల్ బస్‌పాస్ చార్జీలను పెంచిన ఆర్టీసీ, అదేదారిలో టీ-24 (ట్రావెల్ యాజ్ యు లైక్) టికెట్ చార్జీలను పెంచింది. సీనియర్ సిటీజన్లకు టీ-24 టికెట్ రూ. 100 చార్జీ ఉండగా దాన్ని రూ. 120కి, పిల్లలకు రూ. 80 నుంచి 100కు పెంచారు.
ఉజ్జయినీ మహాకాళి బోనాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌కు 175 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ శుక్రవారం వెల్లడించారు. 13, 14తేదీల్లో జరిగే బోనాలకు నగరం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరిలివచ్చే అవకాశాలున్న నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా స్పెషల్ సర్వీసులు నడిపేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ప్రయాణికులకు చిల్లర కష్టాల్ని దూరం చేస్తుంది.
ఒక రోజులోనే ఆలయాలు సందర్శించి తిరిగి నగరానికి చేరుకునేలా ఆర్టీసీ టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. కూకట్‌పల్లి రీజనల్ పరిధిలో కూకట్‌పల్లి, జీడిమెట్ల, మేడ్చల్, మియాపూర్-2, హెచ్‌సీయూ డిపోల నుంచి టూర్ ప్యాకేజీలను ఈ నెల 27వ తేదీ నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు డిప్యూటీ రీజనల్ మేనేజర్ అపర్ణ కల్యాణి ఓ ప్రకటనలో తెలిపారు.