Bengaluru to Bodhan: బోధన్ వాసులకో గుడ్ న్యూస్.. బెంగళూరు నుంచి..
ABN , Publish Date - Nov 12 , 2025 | 01:47 PM
బెంగళూరు నుంచి ప్రతిరోజూ బోధన్‌కు సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్టు టీజీఎస్‌ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ప్రసాద్‌గౌడ్ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు బోధన్‌లో బయల్దేరే బస్సు బాన్సువాడ, నర్సాపూర్, మెదక్, బాలానగర్‌ల మీదుగా హైదరాబాద్ జేబీఎస్ బస్టాండ్‌కు చేరుతుందన్నారు.
- బెంగళూరు నుంచి బోధన్‌కు బస్సు సర్వీసు
బెంగళూరు: బెంగళూరు(Bengaluru) నుంచి ప్రతిరోజూ బోధన్(Bodhan)కు సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్టు టీజీఎస్‌ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ప్రసాద్‌గౌడ్ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు బోధన్‌లో బయల్దేరే బస్సు బాన్సువాడ, నర్సాపూర్, మెదక్, బాలానగర్‌ల మీదుగా హైదరాబాద్ జేబీఎస్ బస్టాండ్(Hyderabad JBS Bus Stand)కు చేరుతుందన్నారు. బెంగళూరుకు ఉదయం 5.45 గంటలకు మెజస్టిక్ బస్టాండ్‌కు వస్తుందన్నారు. ప్రతిరోజూ బెంగళూరు నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరే బస్సు మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు బోధన్(Bodhan)కు వెళ్తుందన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
హాయ్‌ల్యాండ్‌కు గ్రూప్-1 పత్రాల తరలింపుపై రికార్డుల్లేవ్
Read Latest Telangana News and National News
