TGSRTC: పుట్టపర్తికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
ABN , Publish Date - Oct 23 , 2025 | 09:55 AM
భగవాన్ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్టీసీ హైదరాబాద్-1 డిపో(Hyderabad-1 Depot) నవంబరులో ప్రతీ శనివారం సాయంత్రం పుట్టపర్తికి ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు డిపో మేనేజర్ ఎం.వేణుగోపాల్ తెలిపారు.
హైదరాబాద్: భగవాన్ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్టీసీ హైదరాబాద్-1 డిపో(Hyderabad-1 Depot) నవంబరులో ప్రతీ శనివారం సాయంత్రం పుట్టపర్తి(Puttaparthi)కి ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు డిపో మేనేజర్ ఎం.వేణుగోపాల్ తెలిపారు. నవంబరు 1వ తేదీ, 8, 15, 22వ తేదీల్లో సాయంత్రం 6గంటలకు ఎంజీబీఎస్(MGBS) నుంచి బయల్దేరి మరుసటి రోజు ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు పుట్టపర్తికి చేరుకుంటుందన్నారు.

తిరిగి పుట్టపర్తి నుంచి అదే రోజు సాయంత్రం 6గంటలకు బయల్దేరి మరుసటి రోజు సోమవారం తెల్లవారు జామున 4గంటలకు ఎంజీబీఎస్‌కు చేరుకుంటుందని ఆయన వివరించారు. 36 సీట్లతో కూడిన సూపర్ లగ్జరీ బస్సులో ఒక్కరికి రూ.2100 చార్జీ వసూలు చేయనున్నారు. టికెట్ బుకింగ్ కోసం దగ్గర్లోని బుకింగ్ ఏజెంట్లనుగాని, టీజీఎస్ ఆర్టీసీ ఆన్‌లైన్ ద్వారా గాని సీట్లను రిజర్వు చేసుకోవాల ని ఆయన విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాల కోసం 9440566379, 7382824794 ద్వారా సంప్రదించవచ్చన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..
మావోయిస్టు మద్దతుదారులపై నజర్!
Read Latest Telangana News and National News