TGSRTC: డిసెంబరు నాటికి 95 ఈవీ బస్సులు
ABN , Publish Date - Nov 11 , 2025 | 07:26 AM
నగరంలో డీజిల్ బస్సులను తగ్గిస్తూ ఈవీ బస్సులను పెంచేందుకు ఆర్టీసీ కృషి చేస్తోంది. రెండేళ్లలో మూడు వేల ఎలక్ర్టిక్ బస్సులు నడపడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రేటర్ జోన్‌లో ఇప్పటికే 265 ఈవీ బస్సులను నడుపుతున్న ఆర్టీసీ క్రమంగా వాటి సంఖ్య పెంచుతోంది.
- గ్రేటర్‌లో క్రమంగా పెంపు
- హయత్‌నగర్- 2 డిపోకు చేరిన 10 బస్సుల
హైదరాబాద్ సిటీ: నగరంలో డీజిల్ బస్సులను తగ్గిస్తూ ఈవీ బస్సులను(EV buses) పెంచేందుకు ఆర్టీసీ కృషి చేస్తోంది. రెండేళ్లలో మూడు వేల ఎలక్ర్టిక్ బస్సులు నడపడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రేటర్ జోన్(Greater Zone)లో ఇప్పటికే 265 ఈవీ బస్సులను నడుపుతున్న ఆర్టీసీ క్రమంగా వాటి సంఖ్య పెంచుతోంది. నవంబరు నెలలో 35 ఎలక్ర్టిక్ బస్సులు తీసుకువస్తుండగా, 10 బస్సులను రెండు రోజుల క్రితం హయత్‌నగర్-2 డిపోకు కేటాయించారు.

దీంతో ఆ డిపోలో ఈవీల సంఖ్య 55కు పెరిగింది. మరిన్ని బస్సులను పటాన్‌చెరువు(Patancheruvu) రూట్లో 5, మెహిదీపట్నం రూట్లో 2, బోరబండ రూట్లో 3 నడుపుతామని అధికారులు చెబుతున్నారు. ఈ నెల చివరినాటికి మరో 25 ఎలక్ర్టిక్ బస్సులు గ్రేటర్‌జోన్‌లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. డిసెంబరు నాటికి మరో 60 ఈవీ బస్సులు రోడ్లపైకి తీసుకొచ్చేదిశగా ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
10 పరీక్షల ఫీజు చెల్లింపునకు 25 వరకు గడువు
సీఎం, డిప్యూటీ సీఎంలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టు
Read Latest Telangana News and National News