Share News

CM Revanth Reddy: హుస్నాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఎప్పుడంటే..

ABN , Publish Date - Nov 29 , 2025 | 08:42 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిసెంబర్ 3వ తేదీన హుస్నాబాద్‌లో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి.

CM Revanth Reddy: హుస్నాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఎప్పుడంటే..
CM Revanth Reddy

సిద్దిపేట జిల్లా, నవంబరు29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) డిసెంబర్ 3వ తేదీన హుస్నాబాద్‌లో (Husnabad) పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి. సీఎం పర్యటన దృష్ట్యా పోలీసు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో హుస్నాబాద్ పట్టణ శివారులోని ఏనె వద్ద మైదానంలోని బహిరంగ సభ ప్రాంగణాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి పొన్నం.


అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు: మంత్రి పొన్నం ప్రభాకర్

ponnam-prabhakar.jpg

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ప్రజాపాలన ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన అభివృద్ధి, ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులపై ఈ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతారని చెప్పుకొచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన అనేక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని వివరించారు మంత్రి పొన్నం ప్రభాకర్.


ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రుల సహకారంతో మిగిలిన సమస్యలను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిష్కరించి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. నాలుగు జిల్లాల మధ్యలో కేంద్రంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి సభకు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం

భూములు అమ్ముకునేందుకు ప్లాన్ చేశారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 29 , 2025 | 08:47 PM