Home » Telangana » Karimnagar
అకాలవర్షం యాసంగి పంటలను దెబ్బతీసి రైతులను ఆగమాగం చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది....
నగరపాలక సంస్థ అధికారులు రూపొందించిన 2025-26 సవరణ బడ్జెట్, 2026-27 సంవత్సరానికి 312.46 కోట్ల రూపాయల అంచనా బడ్జెట్‌పై పాలకవర్గ సభ్యులు నామమాత్రంగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు.
అష్టకష్టాలు పడి యాసంగిలో సాగు చేసుకున్న పంటలపై అకాల వర్షం, రాళ్ల వానల భయం అన్నదాతలను వెంటాడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భగ్గుమున్న ఎండల్లో ఒక్కసారిగా వాతావరణంలో ఏర్పడిన మార్పులతో సోమవారం రాత్రి, మంగళవారం తెల్లవారుజామున పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రైతులను భయభ్రాంతులకు గురిచేసింది.
జిల్లాలోని పలు సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం మరో నెల రోజుల పాటు కొనసాగునున్నది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వీబీజీ రామ్ జీ పథకం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కావలసి ఉండగా, దీనిని ఆయా రాష్ట్రాలు వ్యతిరేకిస్తుండడం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వచ్చే నెలలో ఎన్నికలు జరుగనుండడంతో పథకం అమలును ఒక నెల వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామ, వార్డు సభలను నిర్వహించాలని డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో చెరువులో చేపలు పట్టుకునే విషయంలో గ్రామంలోని ఒకే కులానికి చెందిన రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవ ఒకరి హత్యకు దారితీయగా ఈ కేసులో నిందితులైన 15 మందికి జీవితఖైదుతోపాటు రూ.1,500 చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ మంగళవారం తీర్పు వెల్లడించారు.
రాష్ట్రంలో డిజిటల్ విధానంలో జరిగే మొదటి జనగణన 2027లో మాస్టర్ ట్రైనర్‌లు కీలకమని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురి చేసింది. ఈదురు గాలులతో మొదలైన వర్షం ఉధృతరూపం దాల్చింది. దీంతో పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. రాత్రి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రజలు ఇబ్బందిపడ్డారు.
సిరిసిల్ల బల్దియ బడ్జెట్‌పై నూతన కౌన్సిల్ ఎంతో ఉత్సాహంగా చర్చలు జరిపింది.