Share News

Harish Rao: రేవంత్‌రెడ్డి నీ ఛాలెంజ్‌‌ని స్వీకరిస్తా.. హరీష్‌రావు ప్రతి సవాల్

ABN , Publish Date - Jun 25 , 2025 | 04:27 PM

సీఎం రేవంత్‌రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ చర్చకు పోదాం అంటున్నారని.. ఎక్కడికి రమ్మంటారో చెప్పాలని.. తాను సిద్ధమని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రతి సవాల్ విసిరారు. అసెంబ్లీ నిర్వహించడం చేతగాక రేవంత్‌రెడ్డి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. వారం రోజులకు మించి అసెంబ్లీ నడిపే పరిస్థితి లేదని హరీష్‌రావు పేర్కొన్నారు.

Harish Rao: రేవంత్‌రెడ్డి నీ ఛాలెంజ్‌‌ని స్వీకరిస్తా.. హరీష్‌రావు ప్రతి సవాల్
BRS MLA Harish Rao

సిద్దిపేట: బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project) గురించి కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (BRS MLA Harish Rao) విమర్శించారు. రేవంత్‌రెడ్డి 18 నెలల పాలన చూశాక కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో ప్రజలకు అర్థమైందని చెప్పారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి, కావాలని ప్రజలు అంటున్నారని తెలిపారు. మళ్లీ పదేళ్ల దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా రేవంత్‌రెడ్డి చేశారని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్‌రావు.


ఈ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే నిర్వహించడం లేదని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. ఇవాళ(బుధవారం) సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం యూత్ కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్ పాటిల్ బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రశాంత్ పాటిల్‌కి హరీష్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హరీష్‌రావు వెంట ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. అబద్ధాల్లో సీఎం రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోటీపడుతున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్‌రావు.


సీఎం రేవంత్‌రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ చర్చకు పోదామని అంటున్నారని.. ఎక్కడికి రమ్మంటారో చెప్పాలని.. తాను సిద్ధమని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రతి సవాల్ విసిరారు. ఏ టీవీలో కూర్చుందామో, ఎక్కడ మాట్లాడుదామో చెప్పు తాను రెడీ... రేవంత్‌రెడ్డి వస్తారో, మహేష్ కుమార్ గౌడ్ వస్తారో చెప్పాలని ప్రతి సవాల్ చేశారు. అసెంబ్లీ నిర్వహించడం చేతగాక రేవంత్‌రెడ్డి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. వారం రోజులకు మించి అసెంబ్లీ నడిపే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. మళ్లీ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచేది కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ఐదేళ్లు పూర్తిగా అధికారంలో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ ఎన్నికల కోసం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. అందరం కలసి ఐక్యతతో ముందుకు పోతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సాధ్యమని హరీష్‌రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ.. డ్రగ్స్ నివారణ పోస్టర్లు విడుదల

ఫోన్ ట్యాపింగ్ కేసు.. తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jun 25 , 2025 | 05:14 PM