MLC Kavitha: బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయి.. కవిత ఫైర్
ABN , Publish Date - Jul 22 , 2025 | 05:32 PM
కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు బీసీల రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభ , మండలిలో ఆమోదించి ప్రభుత్వం పంపిందని.. కానీ రిజర్వేషన్‌లకు మతం రంగు పులిమి రాష్ట్రపతి వద్దకు కేంద్ర ప్రభుత్వం పంపలేదని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్: కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) రెండు జాతీయ పార్టీలు బీసీల రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఆరోపించారు. ఇవాళ(మంగళవారం) తెలుగు యూనివర్సిటీ వద్ద కవిత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభ, మండలిలో ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం పంపిందని.. కానీ రిజర్వేషన్‌లకు మతం రంగు పులిమి రాష్ట్రపతి వద్దకు కేంద్ర ప్రభుత్వం పంపలేదని చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ కవిత.
తెలంగాణలో బీజేపీకి ఓట్లు రావని తెలిసే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు రిజర్వేషన్ల బిల్లు తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చలేమని మాట్లాడారని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు చేస్తూ, దక్షిణాది రాష్ట్రాల్లో న్యాయపరమైన సమస్యలు అంటూ దాటవేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికి 50 సార్లకు పైగా ఢిల్లీ వెళ్లారని.. కానీ రిజర్వేషన్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఒత్తిడి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి, 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కెవిట్ పిటీషన్ వేసి, రిజర్వేషన్లపై ఆర్డినెస్ తీసుకొచ్చి, చట్టబద్ధత కల్పించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ టెట్ 2025 ఫలితాలు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండిలా..
Read Latest Telangana News and National News