Minister Komati Reddy: కాళేశ్వరం నాసిరకం ప్రాజెక్ట్.. కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి విసుర్లు
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:46 PM
Minister Komati Reddy Venkat Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం 8వ వింత అని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు. మూడేళ్లలో నిర్మాణం, మూడేళ్లలో కూలిపోవడం ఎనిమిదో వింతగా కేసీఆర్ చెప్పిందే నిజం అయ్యిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.

హైదరాబాద్: ఎన్డీఎస్ఏ రిపోర్టు తాము బయట పెట్టలేదని.. వాళ్లే బయట పెట్టారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ఒక నాసిరకం ప్రాజెక్ట్ అని విమర్శించారు. ఇవాళ(శనివారం) హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వేషన్ సెంటర్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ... కాళేశ్వరం తన మానస పుత్రిక అని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. కాళేశ్వరం కథ త్వరలోనే అందరికీ తెలుస్తుందని అన్నారు. రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం చేపట్టి మోసం చేశారని ఆరోపించారు. తెలివి ఉన్న ఎవరైనా కాళేశ్వరం చేపడతారా అని ప్రశ్నించారు. తమ్మిడిహట్టి పూర్తయితే కాంగ్రెస్‌కు పేరు వస్తుందని పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. మేడిగడ్డ కుంగిపోవడం చిన్న విషయం అన్నట్లుగా మాట్లాడారని అన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల పనికిరావని ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇచ్చిందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
కాళేశ్వరం 8వ వింత అని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు. మూడేళ్లలో నిర్మాణం, మూడేళ్లలో కూలిపోవడం 8వ వింతగా కేసీఆర్ చెప్పిందే నిజం అయ్యిందని విమర్శించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వ బాగోతం బయటపడిందని విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసింది కేసీఆర్ అని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద ఈ ప్రాజెక్టు కట్టకుండా.. కమీషన్ల కోసం వేరే చోట ప్రాజెక్టు కట్టారని మండిపడ్డారు. త్వరలోనే బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్డీఎస్ఏకు ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదాన్ని విచారణకు ఎందుకు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారని అన్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ ఇచ్చిన రిపోర్ట్‌పై కేటీఆర్‌కు అవగాహన లేదని, ఆయన మాట్లాడకపోవడం చాలా మంచిదని అన్నారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ నిర్మిస్తే విఫలం అవుతుందని రిటైర్డ్ ఇంజనీర్ అధికారులే చెప్పారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో వరంగల్‌ను విధ్వంసం చేశారు: నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ సభను వరంగల్ ప్రజలు బహిష్కరించాలని అన్నారు. ఇవాళ(శనివారం) వరంగల్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో బీఆర్ఎస్‌పై రాజేందర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో వరంగల్‌ను విధ్వంసం చేశారని ఆరోపించారు. వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు చేశారని మండిపడ్డారు. వరంగల్‌కు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. సభను పాత కరీంనగర్ జిల్లా.. ఇప్పటి హనుమకొండ జిల్లాలో పెట్టుకుని ఛలో వరంగల్ అంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ సభకు వరంగల్‌కు ఏం సంబంధమని నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ వార్తలు కూాడా చదవండి...
Kaleshwaram: తుమ్మిడిహెట్టి నిర్మాణం 3 బ్యారేజీలు పునర్నిర్మాణం
Mahabubabad: మానుకోటలో ఏసీబీ దాడులు
CM Revanth Reddy: పీవోకేను భారత్‌లో కలిపేయండి
Read Latest Telangana News And Telugu News