Home » Kaleshwaram Project
ఏపీ మంత్రి నారా లోకేష్ బనకచర్ల ప్రాజెక్టు కడతామని అన్నారని.. ఈ ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బనకచర్లను సీడబ్ల్యూసీ తిరస్కరించిందని గుర్తుచేశారు. బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని ఢిల్లీలో జరిగిన సమావేశంలో తాము చెప్పామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ మాత్రమే కాదు.. ధరలు, కాంట్రాక్టుల సవరణల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని జస్టిస్ ఘోష్ కమిషన్ తేల్చింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ దోషి అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసి తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని పీసీ ఘోష్ కమిషన్ తేల్చి చెప్పిందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, వైఫల్యాల్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కీలకమని జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్ తేల్చింది. ఈ విషయంలో ఆయన పాత్ర విస్మరించలేనిదని తెలిపింది.
కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై అధ్యయనం కోసం సర్కారు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అధికారులు సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో సీఎంకు నివేదిక అందజేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై విచారించిన పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నివేదికను షీల్డ్ కవర్‌లో ప్రభుత్వానికి అందజేశారు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్.
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. రేపటితో జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ముగియనుంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయింది. రేపు ఫైనల్ రిపోర్టుపై పీసీ ఘోష్ సంతకం చేయనున్నారు. ఆగస్టు 1వ తేదీ లేదా 2వ తేదీన ప్రభుత్వానికి కాళేశ్వరం రిపోర్ట్ అందజేయనుంది.
కాళేశ్వరం బ్యారేజీలపై న్యాయ విచారణ గడువును ఆగస్టు 3వ తేదీ దాకా పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో షోకాజు నోటీసులు అందుకున్న అధికారుల్లో ఒకరిద్దరు తప్ప.. అందరూ తమ సంజాయిషీలను ప్రభుత్వానికి సమర్పించారు.