Hydra Operations in Musi: మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా సహాయక చర్యలు..
ABN , Publish Date - Sep 27 , 2025 | 03:49 PM
మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. రిటర్నింగ్ వాల్ పడిపోవడంతో ఎంజీబీఎస్‌కు వరద పోటెత్తిందని రంగనాథ్ తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణతోపాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. వానలు దంచికొడుతుండటంతో మూసీ పరివాహక ప్రాంతాలకు వరద భారీగా పోటెత్తింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జంట జలశయాల (హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్) గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. నగరంలోని మహత్మాగాంధీ బస్సు స్టేషన్ (MGBS)కు వరద ప్రవాహం పోటెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) ఇవాళ(శనివారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.
ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో (Musi River Catchment Areas) హైడ్రా సహాయక చర్యలు (Hydra Relief Operations) కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రిటర్నింగ్ వాల్ పడిపోవడంతో ఎంజీబీఎస్‌కు వరద పోటెత్తిందని చెప్పుకొచ్చారు. ఎంజీబీఎస్‌లో డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని రంగనాథ్ తెలిపారు. ప్రస్తుతం ఎంజీబీఎస్‌లో వరద పరిస్థితి అదుపులోకి వచ్చిందని పేర్కొన్నారు. బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. వరద తగ్గే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. మూసీ పరివాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అప్రమత్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
ఓటు చోరీపై మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు
Read Latest Telangana News and National News