Home » HYDRA
గండిపేట మండలంలో దాదాపు 1.23 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా కాపాడింది. ఆ స్థలం విలువు దాదాపు రూ.60 కోట్లు ఉంటుందని సెక్రటేరియట్ కాలనీవాసులు పేర్కొన్నారు.
మిడిల్ ఈస్ట్ దేశాల్లో చమురు కోసం జరుగుతున్న యుద్ధాల మాదిరిగానే.. భవిష్యత్తులో నీటికోసం యుద్ధాలను చూడబోయే కాలం మరెంతో దూరం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు.
సర్కారు భూముల ఆక్రమణలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అత్తాపూర్ రెవెన్యూ పరిధిలోని 354/1, 354/2, 354/3 సర్వే నంబర్లలోని 2.34 ఎకరాల భూమిని కబ్జాదారుల నుంచి హైడ్రా అధికారులు కాపాడారు.
సీఎం రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంక్‌కు మూసీ పరివాహక ప్రాంత భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
2024, సెప్టెంబర్ 3వ వారంలో ఇక్కడ దాదాపు 16 ఆక్రమణలను తొలగించామని హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తొలి విడతలో 6 చెరువులను అభివృద్ధికి ఎంపిక చేశామని చెప్పారు.
గతంలో తాను మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న సమయంలో నిధులు లేక ఈ నల్లచెరువును అభివృద్ధి చేయలేక పోయినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కూకట్‌పల్లిలో ప్రస్తుతం నల్లచెరువు అభివృద్ధిని చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.
కూకట్‌పల్లి నల్లచెరువుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ చెరువును అన్ని రకాల సౌకర్యాలతో సిద్ధం చేశారు.
బతుకమ్మ కుంటను పునరుద్ధరించి అందరి ప్రశంసలు పొందిన తెలంగాణ ప్రభుత్వం మరో చెరువుకు జీవం పోసింది. ఓల్డ్ సిటీలోని బమృక్ ఉద్దౌలా చెరువును నేడు( మార్చి 08) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
మహానగరంలో చెరువుల పునరుద్ధరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. తొలి దశలో ఆరు చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన హైడ్రా ఇప్పటికే బతుకమ్మకుంటను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఐటీ కారిడార్ సమీపంలోని గంధంగూడలో 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది.