Hydra Demolitions: తగ్గేదేలేదంటున్న హైడ్రా.. అక్రమ నిర్మాణాలపై కొరడా
ABN , Publish Date - Nov 17 , 2025 | 01:04 PM
అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌ను అధికారులు కూల్చివేశారు. సంధ్యా శ్రీధర్ రావు తమ ప్లాట్లను ఆక్రమించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టారు.
హైదరాబాద్, నవంబరు17 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు (Hydra Officials) ఉక్కుపాదం మోపారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో గచ్చిబౌలిలో ఇవాళ(సోమవారం) భారీ కూల్చివేతలు చేపట్టారు. ఎఫ్‌సీఐ లే అవుట్‌లో అక్రమంగా నిర్మించిన సంధ్యా కన్వెన్షన్ భవనాలను నేలమట్టం చేశారు. హైడ్రాలిక్ జాక్ క్రషర్‌తో నిర్మాణాలను కూల్చివేశారు. తమ ప్లాట్లను ఆక్రమించి సంధ్యా శ్రీధర్ రావు రోడ్లు వేశారని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు బాధితులు.
ఈ క్రమంలో సంధ్యా శ్రీధర్ రావు అక్రమాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. న్యాయస్థానం ఆదేశాలతో హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే, అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు దూకుడుతో ముందుకెళ్తున్నారు. ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదులు వస్తే శరవేగంగా చర్యలు చేపడుతున్నారు. హైడ్రా అధికారులు తమకు అండగా నిలవడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్.. సీవీ ఆనంద్ ఏమన్నారంటే..
షాకింగ్ .. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లు బంద్..
Read Latest Telangana News and National News