Home » Illegal Constructions
మూసీనది గర్భంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. చాదరఘాట్ బ్రిడ్జి నుంచి పాతబస్తీ ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించారు. ఈ స్థలాన్ని వాహనాల పార్కింగ్ కోసం ఆక్రమణ దారులు వినియోగిస్తున్నారు.
భాగ్యనగరంలో హైడ్రా అధికారుల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వరుసగా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. శుక్రవారం కూకట్‌పల్లి బాలాజీనగర్ డివిజన్ హబీబ్‌నగర్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
పాత బస్తీలోని సూరం చెరువులో నిర్మించిన ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీ నడుస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. అందుకనే ఈ కాలేజీని కూల్చివేయడానికి ఆలోచిస్తున్నామని ఏవీ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు.
రాజేంద్రనగర్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేయడానికి వచ్చిన అధికారులతో వాగ్వాదానికి స్థానికులు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పార్క్ స్థలం కబ్జా చేయడంతోనే కూల్చివేతలు చేపట్టామని హైడ్రా అధికారులు చెబుతున్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ మండలం బౌరంపేట్ గ్రామం సర్వే నంబర్ 345/పీ, 347/పీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని హెచ్‌ఎండీఏకు హైకోర్టు ఆదేశించింది.
హైడ్రా పేరుతో ఇక సెటిల్‌మెంట్లు చేస్తే ఊరుకునేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. వంశీరామ్ బిల్డర్స్‌పై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన ఫిర్యాదు అందిందని తెలిపారు.
GHMC: అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం జూబ్లీహిల్స్, రహమత్ నగర్‌లో పలు నిర్మాణాలను కూల్చివేశారు. జీహెచ్ఎంసీ కూల్చివేతలపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
AP Govt Guidelines: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనధికార, అక్రమ నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.
కొద్ది రోజులుగా దూకుడు తగ్గించిన హైద్రా మళ్లీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో అక్రమంగా నిర్మించిన ప్రకటనల హోర్డింగ్ పాయింట్స్. అక్రమ హోర్డింగ్‌లను అధికారులు కూల్చివేస్తున్నారు.
Hydra: అక్రమ నిర్మాణాలపై దూకుడుగా ఉన్న హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలపై ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తుండటంతో మరో అడుగు వేసింది.