Hydra Tension: హైడ్రా కూల్చివేతల్లో ఉద్రిక్తత.. ఎందుకంటే..
ABN , Publish Date - Sep 21 , 2025 | 04:19 PM
గాజులరామారంలో ఆదివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ కూల్చివేతల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాజులరామారం పరిధిలోని ప్రభుత్వ సర్వేనెంబర్ - 307లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గాజులరామారంలో ఇవాళ(ఆదివారం) హైడ్రా కూల్చివేతలు (Hydra Demolitions) చేపట్టింది. ఈ కూల్చివేతల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాజులరామారం (Gajularamaram) పరిధిలోని ప్రభుత్వ సర్వే నెంబర్ - 307లో కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. గాజులరామారం పరిధిలోని దేవేంద్రనగర్, బాలయ్య నగర్, హబీబ్ నగర్ కాలనీలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా.
హబీబ్ నగర్‌లో కూల్చివేతలు చేపట్టిన సిబ్బందిపై ఎదురు దాడికి దిగారు బస్తీ వాసులు. బందోబస్తులో ఉన్న పోలీసులతో పాటు, కూల్చివేతలు చేపట్టిన హైడ్రా జేసీబీలపై రాళ్ల దాడి కురిపించారు బస్తీ వాసులు. రాళ్లదాడిలో పోలీసు అధికారితో పాటు, జేసీబీ అద్దాలు పగిలాయి. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ దాడికి కారణమైన వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కి తరలించారు. కూల్చివేతలు జరిగే ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
కాగా, గాజులరామారంలో ఆదివారం హైడ్రా బిగ్ ఆపరేషన్ చేపట్టింది. సర్వే నెంబర్ -307లో అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూల్చివేతలను అడ్డుకున్నారు స్థానికులు. స్థానికులకు, హైడ్రా అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ ఇళ్లను కూల్చి వేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవేందర్ నగర్, బాలయ్య బస్తి, పోచమ్మ బస్తీలు వందలాది ఇళ్లను నేలమట్టం చేసింది హైడ్రా. ప్రభుత్వ భూమిని తమ ఆధీనంలోకి తీసుకుంది హైడ్రా.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ డీఎస్పీ నళిని సంచలన పోస్టు.. అసలు విషయమిదే..
హైదరాబాద్‌లో బతుకమ్మ పండుగ సంబరాలకు రంగం సిద్ధం..
Read Latest Telangana News And Telugu News