Hydra: హైడ్రా మళ్లీ దూకుడు.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
ABN , Publish Date - Jul 29 , 2025 | 04:33 PM
మూసీనది గర్భంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. చాదరఘాట్ బ్రిడ్జి నుంచి పాతబస్తీ ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించారు. ఈ స్థలాన్ని వాహనాల పార్కింగ్ కోసం ఆక్రమణ దారులు వినియోగిస్తున్నారు.

హైదరాబాద్: మూసీనది గర్భంలో ఆక్రమణలను హైడ్రా (Hydra) అధికారులు తొలగించారు. చాదరఘాట్ బ్రిడ్జి నుంచి పాత బస్తీ ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించారు. ఈ స్థలాన్ని వాహనాల పార్కింగ్ కోసం ఆక్రమణ దారులు వినియోగిస్తున్నారు. చదును చేసి షెడ్డులు నిర్మించి కిరాయికి ఇస్తున్నారు కబ్జాదారులు. మూసీ ఆక్రమణలపై హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలు చేపట్టారు. 3.10 ఎకరాల మేర కబ్జా చేసి షెడ్డు నిర్మించి అక్రమ వ్యాపారం చేస్తున్నారు ఆక్రమణ దారు తికారంసింగ్. అలాగే 1.30 ఎకరాల మేర కబ్జా చేశారు ఆక్రమణ దారు పూనమ్ చాంద్ యాదవ్.
5.22 ఎకరాల మేర కబ్జా చేశారు జయకృష్ణ. కబ్జా చేసిన వారంతా అక్కడ షెడ్డులు వేసి.. వాటిని అద్దెకు ఇచ్చి వ్యాపారం చేస్తున్నట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు. బస్సులు, లారీల పార్కింగ్ కోసం కిరాయికి ఇస్తూ ఆక్రమణ దారులు వినియోగిస్తున్నారు. ఆ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. మూసీ గర్భంలో మట్టిపోసి షెడ్డులని నిర్మించినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. నర్సరీ బిజినెస్ నిర్వహణ, ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. హైడ్రా అధికారులు తీసుకుంటున్న చర్యలపై పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News