Home » Old City
పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాలు అంతా నగరం వెలుపలే అంటున్నారని చెప్పారు. వచ్చే పదేళ్లలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తెచ్చుకోవడానికి రూపొందించిన ప్రణాళికలో హైదరాబాద్ దక్షిణ ప్రాంత అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని కోరారు.
హైదరాబాద్ పాత బస్తీలో దారుణం జరిగింది. చిన్న వివాదం విషాదంగా మారింది.కొంత మంది యవకులు జకీర్ ఖాన్ (62)పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
పాతబస్తీ దివాన్‌దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తులో ఉన్న బట్టల షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు 30 కి పైగా బట్టల షాపులకు మంటలు అంటుకున్నాయి. 20 ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.
హైదరాబాద్ పాతబస్తీ, జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. కిషన్ బాగ్ ఎక్స్ రోడ్డు సమీపంలో ఓ బిల్డింగులో సెల్లార్ లోని ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే కాసేపటికే మంటలు పైకి పాకాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. భవనంలో ఉన్నవారిని బయటకు తీసుకువచ్చారు.
పాత బస్తీ మెట్రో నిర్మాణానికి సంబంధించిన కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఆస్తుల సేకరణలో భాగంగా ఇటీవల చెక్కులు అందజేసిన నిర్వాసితుల ఇళ్లను తొలగిస్తున్నారు.
ఓల్డ్‌సిటీ వాసులు మెట్రో రైలు కోసం మద్దతు పలుకుతున్నారు. తమ ప్రాంతంలో మెట్రో కలను నెరవేర్చుకోవడంలో భాగంగా ఆస్తులను ఇచ్చేందుకు సుముఖత చూపిస్తున్నారు.
పాతబస్తీ(Old City)లో మెట్రో నిర్మాణానికి అవసరమైన క్షేత్రస్థాయి పనులను హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్), రెవెన్యూ అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు.
ఇటీవల జీహెచ్ఎంసీ మేయర్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి పాత బస్తీలోని హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చికెన్ తింటున్న ఎలుకలను చూసి సాక్షాత్తు మేయర్ అవాక్కయ్యారు.
ఉషారాణి, మోహన్ లాల్ దంపతులు గత కొంత కాలంగా బాణాసంచా దుకాణం నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్బంగా ముందుగానే టాపాసులు తీసుకువచ్చి ఇంట్లో నిలువ ఉంచుకున్నారు. రాత్రి ఇంట్లో వంట చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిరి టపాసుల్లో పడడంతో మంటలు అంటుకున్నట్లు సమాచారం. ఒక్కసారిగా మంటలు పెరిగి ఇంట్లో ఉన్న బాణా సంచా మొత్తం పేలిపోయింది.
మూసీనదికి పూర్వ వైభవాన్ని కల్పించాలని కంకణబద్ధమైన రేవంత్ సర్కారు.. పక్కా ప్రణాళికతో ముం దుకు సాగుతోంది. ‘ఆపరేషన్ మూసీ’కి సన్నాహాలు చేస్తోంది.