Hydra: హైడ్రా మళ్లీ దూకుడు.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:25 AM
భాగ్యనగరంలో హైడ్రా అధికారుల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వరుసగా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. శుక్రవారం కూకట్‌పల్లి బాలాజీనగర్ డివిజన్ హబీబ్‌నగర్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

కూకట్‌పల్లి: భాగ్యనగరంలో హైడ్రా అధికారుల (Hydra officials) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వరుసగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇవాళ(శుక్రవారం) కూకట్‌పల్లి (Kukatpally) బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని హబీబ్‌నగర్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. నాలాల ఆక్రమణపై చర్యలు తీసుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఎన్ఆర్సీ గార్డెన్ ప్రహరీ, మరో ప్రహరీ గోడని కూల్చివేశారు. ఏడుమీటర్ల నాలా ఆక్రమణకు గురైందని గుర్తించిన అధికారులు.. సదరు అక్రమ నిర్మాణాలనూ కూల్చివేశారు. నాలాలోని చెత్త, వ్యర్థాలని హైడ్రా సిబ్బంది తొలగించారు.
నాళాలు ఆక్రమించి కట్టిన ప్రహరీలు, పలు కట్డడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇవాళ(జులై11) ఉదయం నుంచే హైడ్రా అధికారులు పోలీస్ బలగాల సంరక్షణలో హబీబ్‌నగర్ ప్రాంతానికి చేరుకుని ముందుగా నాళా పక్కన ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు. ప్రజలు అడ్డుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హైడ్రా సిబ్బంది జేసీబీలతో కొన్ని గంటలపాటు ఈ కూల్చివేతలని కొనసాగించారు. ఈ నిర్మాణాలను ఎందుకు కూల్చివేస్తున్నామనే దానిపై ప్రజలకు హైడ్రా అధికారులు వివరించారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని హైడ్రా అధికారులు వెల్లడించారు.
కాగా, హైదరాబాద్‌లో గడిచిన రెండు దశాబ్దాలుగా నాళాలపై అక్రమ నిర్మాణాలు భారీ స్థాయిలో వెలిశాయి. నీటి ప్రవాహం సాఫీగా సాగాల్సిన ప్రాంతాల్లో పలు కట్టడాలతో నాళాలు పూర్తిగా పూడిపోతున్నాయి. నాళాల్లోని మురుగునీరు బయటకు పోకుండా కొంతమంది నిర్మాణాలు చేపడుతున్నారు. యథేచ్ఛగా అక్రమార్కులు నిబంధనలని ఉల్లంఘిస్తున్నారు. నాళాలు పూడిపోవడంతో పలు ప్రాంతాలు వర్షాకాలంలో వరదలకు గురవుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యపై హైడ్రా అధికారులకు ఫిర్యాదులు వస్తోండటంతో చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. జర్నలిస్ట్ అవ్వాలనుకుంటున్నారా.. యువతకు ఆంధ్రజ్యోతి ఆహ్వానం
హైదరాబాద్‌లో కల్తీ కల్లు ఘటన.. పెరిగిన మృతులు
Read Latest Telangana News and Telugu News