Home » Kukatpally
హైదరాబాద్ కూకట్ పల్లిలో ఉన్న మంజీరా మాల్‌ను ఇంతకాలం అద్దెకు తీసుకుని నడుపుతున్న లులూ యాజమాన్యం ఇప్పుడు మంజీరా మాల్ ను వేలంపాటలో రూ.319.42 కోట్లకు స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆ పార్టీకి చెందిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో అస్తవ్యస్థ పాలన కొనసాగిస్తోందన్నారు.
బీఆర్ఎస్ నేతలు ఘాటు వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఉరుకోబోమని కూకట్పల్లి బీఆర్ఎస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు బొట్టు విష్ణు, బాలానగర్ అధ్యక్షుడు దర్శనం శాకయ్య హెచ్చరించారు.
జేఎన్టీయూ స్నాతకోత్సవం ఎట్టకేలకు వాయిదా పడింది. ఈ నెల రెండోవారం లోగా స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తామని రెండు నెలల కిందట నోటిఫికేషన్ విడుదల చేసిన వర్సిటీ ఉన్నతాధికారులు తీరా గడువు సమీపించే సరికి తూచ్.. ఇప్పుడు కాదంటూ చేతులెత్తేశారు.
చెరువులు, కుంటల అభివృద్ధి, సుందరీకరణ పనులపై పూర్తి వివరాలు ఇవ్వాలని హైడ్రా అధికారులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.
ఆ ముగ్గురు యువతులు మద్యం మత్తులో ఉన్నారు. పైగా కార్లో కొన్ని బీరు బాటిళ్లు పెట్టుకొని బయలుదేరారు. తాగిన మత్తులో కారు అదుపు తప్పనే తప్పింది.
Rash Driving: మద్యం మత్తులో యువతులు రెచ్చిపోయారు. రాష్ డ్రెవింగ్ చేసి వాహనదారులను ఢీకొట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. వాహనదారులు ఫిర్యాదు చేయడంతో యువతులపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్యం మత్తులో యువతులు హల్చల్ చేశారు. తప్పతాగి నడిరోడ్డుపైకి వచ్చి నానా బీభత్సం సృష్టించారు. కూకట్పల్లి మెట్రోస్టేషన్ సమీపంలో కారుతో వాహనదారులను ఢీకొట్టడమేకాకుండా వారిని బెదిరించారు.
ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌కు చిరునామాగా నిలిచిన జేఎన్టీయూలో పరిశోధనలకు ప్రాధాన్యం లభిస్తుందా అంటే.. విద్యార్థి వర్గాల నుంచి లేదనే జవాబు వస్తోంది. ప్రతియేటా పీహెచ్డీ నోటిఫికేషన్లను జారీచేయడంలో అడ్మిషన్ల విభాగం అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
రోడ్డు ప్రమాదం(Road accident)లో భారీగా రక్తాన్ని కోల్పోయి సృహ తప్పి పడిపోయిన వ్యక్తిని రక్షకభటులు అక్కున చేర్చుకుని అండగా నిలిచి ప్రాణాలను నిలబెట్టారు. సోమవారం మధ్యాహ్నం నిజాంపేట(Nizampet)లోని హైటెన్షన్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దినసరి కూలీగా పనిచేస్తున్న జట్టా గంగయ్య (44)కు తీవ్ర గాయాలయ్యాయి.