Share News

MLA Madhavaram Krishna Rao: సీఎంగారూ.. తులం బంగారం హామీ ఏమైందిసారూ..

ABN , Publish Date - Nov 21 , 2025 | 10:57 AM

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నేటివరకూ అమలు కాలేదని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నగదు ప్రోత్సాహకంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి.. రెండేళ్లు కావస్తున్నా నేటికీ అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తోందన్నారు.

MLA Madhavaram Krishna Rao: సీఎంగారూ.. తులం బంగారం హామీ ఏమైందిసారూ..

- షాదీముబారక్‌ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే మాధవరం

హైదరాబాద్: కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం నగదు ప్రోత్సాహకంతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ నీటిమూటేనా అని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) అన్నారు. గురువారం బాలానగర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో కార్పొరేటర్లు ముద్దం నర్సింహయాదవ్‌, ఆవుల రవీందర్‌రెడ్డి, పండాల సతీ్‌షగౌడ్‌, మందాడి శ్రీనివా్‌సరావులతో కలిసి 67 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.


city5.2.jpg

అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో నాటి సీఎం కేసీఆర్‌ దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పేదింటి ఆడపడుచుల పెళ్లిళ్లకు లక్షా పదహారువేల రూపాయలు ఇచ్చారన్నారు. కానీ, ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతలు ఈ పథకాల కింద డబ్బుతో పాటు తులం బంగారం ఇస్తామని బూటకపు మాటలు చెప్పి ప్రజలను ప్రలోభాలకు గురిచేశారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా తులం బంగారం హామీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

రూపాయి మారకానికి లక్ష్యమేమీ పెట్టుకోలేదు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 21 , 2025 | 10:57 AM