Home » Madhavaram Krishna Rao
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ స్యూస్‌లకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులో పలు అంశాలను ప్రస్తావించారు కవిత.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలపై కవిత స్పందించారు. ఆయన చేసిన ప్రతి ఆరోపణలకు డాక్యుమెంట్లతో సహా ప్రెస్‌మీట్ పెడతానని వెల్లడించారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నేటివరకూ అమలు కాలేదని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నగదు ప్రోత్సాహకంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి.. రెండేళ్లు కావస్తున్నా నేటికీ అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తోందన్నారు.
తనపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై ఏ సిట్టింగ్ జడ్జితోనైనా విచారణకు సిద్ధమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ప్రతి సవాల్ విసిరారు. ఇల్లు, కాలేజీ, సీలింగ్ ల్యాండ్, మఠం ల్యాండ్, కేపీహెచ్‌పీ భూములుపై విచారణ చేయాలని, ఈ విషయంలో తాను భయపడే వ్యక్తిని కాదని అన్నారు.
గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని, అమలు కాని హామీలతో కాంగ్రెస్ పాలకులు ప్రజలను మోసం చేశారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ఆ పార్టీ నాయకులను నిలదీయాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీర్‌పూర్‌రాజులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణారావు బాకీ కార్డు బ్రోచర్స్‌ను విడుదల చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఎర్రగడ్డలోని షంషీర్ ఫంక్షన్ హాల్‌లో డివిజన్‌కు సంబంధించిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కూకట్‌పల్లిలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కూకట్‌పల్లిలోని హనుమాన్‌దేవాలయం వద్ద బతుకమ్మ ఆడే స్థలాన్ని కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలి బతుకమ్మ (ఎంగిలిపూల బతుకమ్మ కూకట్‌పల్లిలో అమావాస్యకు ఒక్కరోజు ముందుగానే ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్‌తో గెలిచి సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచి గెలవాలని శుక్రవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వారికి సవాల్ విసిరారు.