Home » Gachibowli
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో శనివారం సాయంత్రం ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా కచేరిని నిర్వహించనున్నారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మాగంటి గోపినాథ్ కుమార్తెలకు గాయాలయ్యాయి. శంషాబాద్ నుంచి వస్తుండగా జరిగిన ఈ ఘటనలో పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది.
గచ్చిబౌలిలో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి తండ్రీకొడుకులు ఇద్దరినీ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ నిర్వహించి కొకైన్ ముఠా దందాను గుట్టురట్టు చేసింది. ఈ ఆపరేషన్‌లో 32 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకుని, అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్‌తో పాటు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు..
హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి ఎల్‌ఐజీ ప్లాట్లకు నేడు లాటరీ తీయనున్నారు. మొత్తం 111 ప్లాట్లకుగానూ 2,685 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వాటికి సంబంధించి మంగళవారం లాటరీ తీయనున్నారు.
అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌ను అధికారులు కూల్చివేశారు. సంధ్యా శ్రీధర్ రావు తమ ప్లాట్లను ఆక్రమించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టారు.
కో లివింగ్ హాస్టల్‌లో తేజ కృష్ణ, లోకేష్ రెడ్డి వద్ద డ్రగ్స్ లభించాయని డీసీపీ చెప్పారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరో నలుగురు.. హోటల్ నైట్ ఐలో దొరికారన్నారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అపార్ట్‌మెంట్ ఓనర్‌ను హాస్టల్ యజమాని అమర్నాథ్ రెడ్డి చితకబాదాడు. అపార్ట్‌మెంట్‌లో తనకున్న 25 ప్లాట్లను హాస్టల్ నిర్వహించడానికి అద్దెకు ఇంటి యజమాని పిచ్చయ్య ఇచ్చాడు. కరోనాకు ముందు 25 ప్లాట్లను అద్దెకు ఇచ్చాడు.
ఆదాయాన్ని ఇచ్చే రిజిస్ట్రేషన్ కార్యాలయాల రూపురేఖలను తమ ప్రభుత్వంలో మార్చే ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఇంటిగ్రేటెడ్ సబ్- రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చెప్పబోతున్నామని వ్యాఖ్యానించారు.
కంచ గచ్చిబౌలి భూ వ్యవహారంలో అటవీ పునరుద్ధరణకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. అయితే, మంచి ప్రణాళికతో వస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడమే కాక సుమోటోగా తీసుకున్న చర్యలను కూడా ఉపసంహరించుకుంటామని సీజేఐ జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు.