Miyapur Demolition: మియాపూర్‌లో ఐదంతస్తుల అపార్ట్‌మెంట్ కూల్చేసిన హైడ్రా
ABN , Publish Date - Nov 01 , 2025 | 02:08 PM
కోట్ల రూపాయలు విలువ చేసే మరో ప్రభుత్వ స్థలాల్ని రేవంత్ సర్కారు కాపాడింది. హైదరాబాద్ మియాపూర్‌లోని ఐదంతస్తుల భవనాన్ని హైడ్రా ఈ ఉదయం కూల్చివేసి స్థలం స్వాధీనం చేసుకుంది. పోలీసులను మోహరించి..
హైదరాబాద్, సెప్టెంబర్ 1: భాగ్యనగరంలో కోట్ల రూపాయల విలువ చేసే మరో ప్రభుత్వ స్థలాల్ని రేవంత్ సర్కారు కాపాడింది. అక్రమ నిర్మాణాల విషయంలో దూకుడుగా వెళ్తోన్న హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు వచ్చిన వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేసింది. తన పరిశీలనలో సదరు భవనం, నిర్మాణ స్థలం అక్రమమని తేలడంతో.. వెంటనే కూల్చివేసింది. దీంతో హైదరాబాద్ మియాపూర్‌లోని ఐదంతస్తుల భవనం నేలకొరిగింది.
మియాపూర్‌లోని సర్వే నంబర్ 100లో భారీగా అక్రమ నిర్మాణాలు జరిగాయని గుర్తించించిన ఈ ఉదయం హైడ్రా ఐదంతస్తుల అపార్ట్ మెంట్ కూల్చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి పని పూర్తి చేశారు.
ఇలా ఉండగా, కూల్చి వేత గురించి హైడ్రా తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో కేసు పూర్వాపరాలు తెలియజేసింది. ఆ వివరాలు యథాతథంగా..
🔷మియాపూర్లో అక్రమ కట్టడంపై హైడ్రా చర్యలు.
🔷ప్రభుత్వ భూమిలో నిర్మించిన 5 అంతస్తుల భవనం కూల్చివేత.
🔷అమీన్పూర్ లో అనుమతులు.. మియాపూర్ ప్రభుత్వ భూమి(HMDA కు చెందిన)లో అక్రమ కట్టడాలు.
🔷అమీన్పూర్ లోని సర్వే నంబర్ 337, 338 సర్వే నంబర్ల పక్కనే ఉన్న మియాపూర్ 101 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూమిలోకి చొరబడి అక్రమ కట్టడాలు.
🔷అమీన్పూర్ సర్వే నంబర్ 337, 338 లలో హుడా అప్రూవ్డ్ లే అవుట్ లో 400ల గజాల 126 నెంబర్ ప్లాట్ కొని.. ఆ పక్కనే మియాపూర్ సర్వే నంబర్ 101 ప్రభుత్వ స్థలంలోకి చొరబడి 126/D , 126/ part, 126/C గా ప్లాట్లు సృష్టించిన భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు.
🔷మియాపూర్లోని HMDA భూమిలోని దాదాపు 473 గజాలు కలుపుకొని భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు ఎల్లారెడ్డి అండ్ అదర్స్ మొత్తం దాదాపు 873 గజాల మేర 5 అంతస్తుల భవనం నిర్మాణం.
🔷ఫేక్ LRS సృష్టించిన భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు.
🔷LRS కోసం డబ్బులు చెల్లించినట్టు పేర్కొన్న DD కూడా ఫేక్.
🔷ఇప్పటికే అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన అధికారులు.
🔷మియాపూర్ ప్రభుత్వ స్థలంలోకి జరిగి నిర్మించిన 473 గజాల మేర ఉన్న భాగాన్ని తొలగించిన హైడ్రా.
🔷ప్రభుత్వ భూమిలోకి వచ్చి చేపట్టిన నిర్మాణం మేరకు హైడ్రా చర్యలు.
🔷ప్రభుత్వ భూమి లోకి జరిగి 5 అంతస్తుల నిర్మించడంపై హైడ్రాకు ఫిర్యాదు చేసిన HMDA అధికారులు.
🔷స్థానిక రెవెన్యూ, HMDA, మున్సిపాలిటీ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలోంచి హైడ్రా.
🔷ప్రభుత్వ భూమిలోకి జరిగి అక్రమంగా భవనం నిర్మిస్తున్నట్టు నిర్ధారించుకున్న హైడ్రా.
🔷2014లో LRS ఫేక్ పత్రాల సృష్టించినట్టు నిర్ధారణ.
🔷 అన్నీ పరిశీలించిన దరిమిలా శనివారం మియాపూర్ పరిధిలోకి వచ్చిన భవనం మేరకు ఆక్రమణలు తొలగింపు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Read Latest Telangana News and National News