Share News

HYDRA Ranganath: వరద ముప్పులేని నగరం కావాలి..

ABN , Publish Date - Dec 11 , 2025 | 07:22 AM

వరద ముప్పులేని నగరం కావాలి... అలాగే వరద ముప్పులేని నగరం అందరి లక్ష్యం కావాలి.. అన్నారు హైడ్రా కమిషనర్ ఆవుల వెంకట రంగనాథ్. ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాదిలో వర్షాకాలం ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తర్వాత వరద నియంత్రణలో విజయవంతమయ్యామన్నారు.

HYDRA Ranganath: వరద ముప్పులేని నగరం కావాలి..

- ఏప్రిల్‌ నాటికి డీ సిల్టింగ్‌ పూర్తిచేయాలి

- పర్యవేక్షణ బాధ్యతల్లో నివాసితులను భాగస్వామ్యం చేద్దాం: హైడ్రా కమిషనర్‌

హైదరాబాద్‌ సిటీ: అసాధారణ వర్షాలు పడుతున్నాయి.. ఒకే రోజు 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదౌతోంది. ఇలాంటి సమయంలో వరదనీరు సాఫీగా సాగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ‘‘వరద ముప్పులేని నగరం అందరి లక్ష్యం కావాలి’’ అని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hyderabad Commissioner AV Ranganath) అన్నారు. జీహెచ్‌ఎంసీ మెయింటినెన్స్‌ విభాగం ఆధ్వర్యంలో జనవరి నుంచి ప్రారంభం కానున్న డీసిల్టింగ్‌ పనుల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ మెయింటినెన్స్‌ విభాగం,


హైడ్రా అధికారులతో బుధవారం హైడ్రా కార్యాలయంలో కో ఆర్డినేషన్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ ఏడాదిలో వర్షాకాలం ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తర్వాత వరద నియంత్రణలో విజయవంతమయ్యామన్నారు. క్యాచ్‌పిట్లు, కల్వర్టులలో సిల్ట్‌ను తొలగించేదే హైడ్రా పని అయినప్పటికీ, ప్రధాన నాలాల్లో పూడికను కూడా తొలగించామని చెప్పారు. డీసిల్టింగ్‌ పనులను ఏప్రిల్‌ నాటికి పూర్తి చేసి, వరద నీరు సాఫీగా సాగడానికి హైడ్రా సహకారం అన్ని విభాగాలకు అందుతుందని తెలిపారు.


city2.2.jpg

స్థానికుల భాగస్వామ్యంతో..

నాలాల్లో డీసిల్టింగ్‌ పనులను జనవరి నుంచే మొదలు పెడుతున్నాం. వీటి పర్యవేక్షణలో స్థానికులతోపాటు, ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేద్దామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అధికారులకు సూచించారు. బస్తీబాట అనే కార్యక్రమాన్ని చేపట్టి నాలాల్లో పూడిక తీసే పనుల్లో స్థానికుల సహకారం అందేలా హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నారు. నాలాల్లో పూడిక తీసే పనుల్లో రాజీ పడొద్దని, ఇది తమ పరిధిలోకి రాదని, ఇంత పూడికను తాము తీయమని కాంట్రాక్టర్లు అనడానికి వీలు లేదని స్పష్టం చేశారు. సమావేశంలో హైడ్రా అదనపు డైరెక్టర్‌ వర్ల పాపయ్య, జీహెచ్‌ఎంసీ మెయింటెనెన్స్‌ విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ రత్నాకర్‌, తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

2030 నాటికి అమెజాన్‌ ఇండియా రూ.3.15 లక్షల కోట్ల పెట్టుబడులు

3 నెలల్లో తుమ్మిడిహెట్టి డీపీఆర్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 11 , 2025 | 07:22 AM