Share News

RAIN Alert: భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

ABN , Publish Date - Nov 02 , 2025 | 07:12 PM

భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం దంచికొడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

RAIN Alert: భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Heavy Rain

హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరం (Hyderabad)లో భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. వర్షం దంచికొడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు.

RAIN.jpg


భాగ్యనగరంలోని పంజాగుట్ట, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడ, బోరబండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, బేగంపేట, ముషిరాబాద్, లింగంపల్లి, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మూసాపేట, ఎర్రగడ్డ, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వాన కురుస్తోంది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వాన పడుతున్న క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.

RAIN-1.jpg


ఈ వార్తలు కూడా చదవండి...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌‌రెడ్డి నయా ప్లాన్

కేసీఆర్ హయాంలో చెరువులు, నాళాల కబ్జాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు: ఎంపీ చామల

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 02 , 2025 | 07:46 PM