BJP MP Laxman: జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
ABN , Publish Date - Jul 03 , 2025 | 11:18 AM
జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారి లడ్డూలో జరిగిన కల్తీ భక్తులను ఆందోళనకు గురి చేసిందని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి, అక్రమాలఫై విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.

తిరుమల: గత జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమలలో చాలా అక్రమాలు జరిగాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (BJP MP Laxman) ఆరోపించారు. గతంలో ఉన్న టీటీడీ పాలకమండళ్లు భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడాయని విమర్శించారు. ఇవాళ(గురువారం) ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామివారిని లక్ష్మణ్ దర్శించుకున్నారు.
అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారి లడ్డూలో జరిగిన కల్తీ భక్తులను ఆందోళనకు గురి చేసిందని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై రామచందర్ రావు విమర్శలు
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(గురువారం) రామచందర్ రావు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటా లేదా.. బీజేపీతో ఎవరికైనా మైత్రి ఉందా అనేది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో, గ్రేటర్ ఎన్నికల్లో తెలుస్తుందని చెప్పుకొచ్చారు.
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కమల వికాసమేనని ధీమా వ్యక్తం చేశారు. తనకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రావడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని ఎవరూ నిరూపించిన వారికీ ఆస్కార్ అవార్డ్ ఇప్పిస్తామని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులకు తాము సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీ అధిష్టానం తనకు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి కార్యకర్త, పార్టీ అధికారం కోసం పనిచేస్తానని రామచందర్ రావు పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందా: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందా అని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ మాజీ మంత్రుల కనుసన్నల్లో ఉన్నట్లుందని విమర్శించారు. మామ, అల్లుళ్లు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ మాయలో పడి ప్రాజెక్ట్‌లు కట్టకుండా నీరుగార్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రేమాయణం.. కాంగ్రెస్ డోలాయమానమని ఎద్దేవా చేశారు. సాగు, నీటి ప్రాజెక్టులపై రెండు పార్టీలది సవాళ్ల డ్రామా అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు
రేవంత్.. తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్!
Read Latest Telangana News And Telugu News